చార్మి, విజయ్ దేవరకొండ లను ట్రోల్ చేస్తున్న మెగా ఫాన్స్, వారిస్తున్న జనసైనికులు

విజయ్ దేవరకొండ , అనన్య పాండే హీరో హీరోయిన్లు గా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చార్మి నిర్మాతగా తీసిన లైగర్ సినిమా నిన్న విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టాక్ బయటకి రాగానే గత సంఘటనలను దృష్టిలో ఉంచుకుని చార్మి, విజయ్ దేవరకొండలను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు కొందరు మెగా అభిమానులు. వివరాల్లోకి వెళితే

ఛార్మికి మెగా అభిమానులకు వైరం ఏంటి అన్న సంగతి ఆలోచిస్తున్నారా…? గతంలో పూరి జగన్నాథ్ చిరంజీవి 150 సినిమా కోసం ఆటో జానీ అన్న స్క్రిప్ట్ వినిపించడం, చిరంజీవి కూడా ఒప్పుకోవడం జరిగినప్పటికీ ఆ తర్వాత స్క్రిప్ట్ విషయంలో తలెత్తిన కొన్ని వివాదాలు, వాటిని పరిష్కరించే క్రమంలో చేసిన స్క్రిప్ట్ మార్పులు చిరంజీవికి నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఈ గ్యాప్ లో చిరంజీవి , శీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్న బ్రూస్లీ సినిమాలో నటించారు. ఆ సినిమా విడుదలైన మొదటి రోజు ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో, బ్రూస్ లీ విడుదలైన రోజు ఛార్మి ఒక నర్మగర్భమైన ట్వీట్ పెట్టింది. ఎంతో సంతోషంతో చప్పట్లు కొడుతున్నట్లుగా ఉన్న ఆ ట్వీట్ బ్రూస్ లీ ఫ్లాప్ అయినందుకే అని భావించిన మెగా అభిమానులు, ఇప్పుడు లైగర్ ఫ్లాప్ కావడంతో చార్మిని “కర్మ సిద్ధాంతం అంటే ఇలానే ఉంటుంది” అంటూ ట్రోల్ చేస్తున్నారు.

అయితే కొంతమంది జనసేన సైనికులు మాత్రం అదే సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులను వారిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే మెగా అభిమానులు, సొంత సామాజిక వర్గం వారు మాత్రమే కాకుండా అందరు హీరోల అభిమానులు జనసేనకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇతర హీరోల అభిమానులతో అనవసరమైన పంతాలకు పోకుండా మెగా అభిమానులు ఉండాలని వారు హితవు పలుకుతున్నారు. పైగా చార్మి చేసిన ట్వీట్ ఒకవేళ నిజమే అయినా, ఇదే లైగర్ సినిమాను చిరంజీవి కూడా ప్రమోట్ చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని వారు అంటున్నారు.

ఏదేమైనా ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఔట్ సోర్సింగ్‌లో పని లేనోళ్లనే తీసేస్తున్నారట !

సీఎం జగన్‌కు కోపం వచ్చిందంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎందుకంటే.. పదేళ్ల లోపు సర్వీస్ ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందర్నీ తొలగించాలని ఇచ్చిన ఆదేశాలను చూసి ఆయనకు కోపం వచ్చిందట. అదేంటి.. ఇంత...

పేరు సీమగర్జన – వినిపించింది చంద్రబాబుపై తిట్ల దండకం !

సీమగర్జన పేరుతో వైసీపీ నాయకులు కర్నూలులో చేసిన హడావుడి ప్రహసనంగా మారింది. పరిస్థితి అర్థమయిందేమో కానీ కర్నూలుకు వచ్చి ప్రసంగిస్తానని గట్టి హామీ ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సమావేశానికి హాజరు...

బాల‌య్య హీరోయిన్ దొరికేసిన‌ట్టేనా..?

బాల‌కృష్ణ తో సినిమా అంటే ద‌ర్శ‌కుల‌కు పండ‌గే. ఎందుకంటే..ఆయ‌న డైరెక్ట‌ర్ల హీరో. సెట్లో ద‌ర్శ‌కుడు ఏం చెబితే అది చేసేస్తారాయ‌న‌. అందుకే ద‌ర్శ‌కులంతా బాల‌య్య‌తో ప‌నిచేయ‌డానికి ఎదురు చూస్తుంటారు. కాక‌పోతే... బాల‌య్య సినిమా...

సాయిధ‌రమ్ టైటిల్‌… ‘విరూపాక్ష‌’?

రిప‌బ్లిక్ త‌ర‌వాత సాయిధ‌ర‌మ్ తేజ్ సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. రోడ్డు ప్ర‌మాదం కార‌ణంగా.. సాయి కొన్నాళ్లు సినిమాల‌కు, షూటింగుల‌కు దూరంగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే కోలుకొని.. మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌స్తున్నాడు. వ‌రుస‌గా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close