జ‌నసేన‌, భాజ‌పా న‌ష్ట‌పోవ‌డానికి టీడీపీ కారణ‌మంటున్న వీర్రాజు..!

దేశ‌మంతా మ‌రోసారి మోడీకి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టినా… ‌ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఖాతా తెర‌వ‌లేక‌పోయింది. విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌తోపాటు, ఇచ్చిన హామీల‌ను దాదాపు 85 శాతం అమ‌లు చేశామ‌ని చాటి చెప్పిన భాజ‌పా నాయ‌కులు… ఏపీలో త‌మ ఉనికి కాపాడుకోలేక‌పోయారు. ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో భాజ‌పా నేత సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రాలో టీడీపీకి 30 సీట్ల‌కు మించి రావ‌ని తాను చాలాసార్లు చెప్పాన‌న్నారు. నాయ‌కుడు అనేవారికి ఒక సొంత ముద్ర ఉండాల‌నీ, మోడీకి అలాంటి సొంత ఇమేజ్‌ ఉంది కాబ‌ట్టే ఘ‌న విజ‌యం సాధించార‌న్నారు. వైకాపా అధ్యక్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా త‌న‌దైన శైలితో వ్య‌వ‌హ‌రించారు కాబ‌ట్టే గెలిచార‌న్నారు. చంద్ర‌బాబు నాయుడుకి అదే లేద‌న్నారు.

తెలుగుదేశం పార్టీ వ‌ల్ల భాజ‌పా తీవ్రంగా న‌ష్ట‌పోయింద‌ని చెబుతూనే, జ‌న‌సేన పార్టీని కూడా అదే త‌ర‌హాలో ఆ పార్టీయే ముంచిద‌ని వీర్రాజు వ్యాఖ్యానించారు. గ‌డ‌చిన నాలుగు సంవ‌త్స‌రాలుగా ఆంధ్రాలో నెల‌కొన్న అరాచ‌క ప‌రిస్థితుల‌ను ప్ర‌జ‌లు మౌనంగా భ‌రిస్తూ వ‌చ్చార‌నీ, ఈ ప‌రిస్థితుల‌ను జ‌గ‌న్ త‌న‌కు అనుకూలంగా మార్చుకున్నార‌న్నారు. ఏపీ ఎన్నిక‌ల్లో భాజ‌పా త‌న‌వంతు పాత్ర పోషించింద‌నీ, ఏం చెయ్యాలో అదే చేసింద‌ని సోము వీర్రాజు అన్నారు.

వాస్త‌వానికి, 2014 ఎన్నిక‌ల్లో కూడా మోడీ హ‌వా బాగా ఉన్నప్పుడు… ఏపీలో పొత్తులో భాగంగా కొన్ని సీట్ల‌ను ఆ పార్టీ గెలుచుకుంది. కానీ, గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా సొంతంగానే బ‌రిలోకి దిగింది. రాష్ట్రానికి చాలా చేశామ‌ని, కాబ‌ట్టి రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ప్ర‌జ‌లు త‌మ‌ను ఆద‌రిస్తారంటూ సోము వీర్రాజు, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, జీవీఎల్ వంటివారు తీవ్రంగా ప్ర‌చారం చేసుకుంటూ వ‌చ్చారు. కానీ, ఏపీ ప్ర‌జ‌లు మ‌రోసారి భాజ‌పాని సీరియ‌స్‌ గా తీసుకోలేదు అనేది స్ప‌ష్ట‌మైంది. ఒక‌వేళ‌, వారు చెప్పిన‌ట్టే… ఆంధ్రాకి గ‌త కేంద్ర ప్ర‌భుత్వం చాలా చేసింద‌ని ప్ర‌జ‌లు కాస్తైనా న‌మ్మి ఉంటే… ఆ ప్ర‌భావం ఎక్క‌డో చోట ప్ర‌తిఫ‌లించాలి క‌దా! ఇంకోటి… వీర్రాజు మాట‌ల్లో జ‌న‌సేన ఓట‌మి ప‌ట్ల సానుభూతిని వ్య‌క్తం చేస్తున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. మ‌నం టీడీపీ వ‌ల్ల న‌ష్ట‌పోయిన పార్టీలం అనే అభిప్రాయాన్ని తీసుకొచ్చే విధంగా మాట్లాడారు. నిజానికి, జ‌న‌సేన తొలిసారిగా ఎన్నిక‌ల్లో పోటి చేసిందే ఈసారి. వామ‌ప‌క్షాల‌తో త‌ప్ప, ఇత‌రుల‌తో పొత్తుల‌కే జ‌న‌సేనాని ప్ర‌య‌త్నించ‌లేదు. ఆ లెక్క‌న‌, ఇత‌ర పార్టీల వ‌ల్ల జ‌న‌సేన న‌ష్ట‌పోయింది అంటూ ఏముంటుంది..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విమానాల వాయిదా : తొందరపడినా ప్రభుత్వం సిద్ధం కాలేకపోయిందా..?

దేశమంతా విమనాశ్రయాలు ఓపెన్ అయ్యాయి.. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం.. ఒక్క రోజు వాయిదా పడ్డాయి. కారణాలేమైనా కావొచ్చు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... లాక్ డౌన్ ఎత్తేసి.. సాధారణ కార్యకలాపాలు ప్రారంభించాలని.. లాక్‌డౌన్ 1.0 అయిపోయినప్పుడే...

శ్రీవారి అమ్మకం ఆస్తుల లిస్ట్ చాలా పెద్దదే..!?

తమిళనాడులో నిరర్థకంగా ఉన్న ఆస్తులను అమ్ముతున్నామని వాటిని అమ్మేస్తే.. రూ. కోటిన్నర కూడా రాదంటూ... అధికార పార్టీ నేతలు వాదిస్తున్నారు. మరి కోటిన్నర కోసమే ఇన్ని విమర్శలను ఎందుకు ఎదుర్కొంటున్నారు.. దేవుడి ఆస్తుల్ని...

ప్రజల భాగస్వామ్యంతో.. “మన పాలన – మీ సూచన..!”

అధికారం చేపట్టి ఏడాది అవుతున్న సందర్భంగా.. ఏపీ సర్కార్ పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలనుకుంది. దాని ప్రకారం ఐదు రోజుల పాటు మేథోమథనం నిర్వహిస్తోంది. ప్రజల ఆలోచనలు, సూచనలను నిరంతరం పరిగణనలోకి తీసుకుంటూ...

నేనూ లైంగిక వేధింపులు ఎదుర్కున్నా

చిత్ర‌రంగంలో లైంగిక వేధింపులు స‌ర్వ‌సాధార‌ణ విష‌యంగా మ‌రిపోయింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ... ఈ విష‌యంలో నోరు మెద‌ప‌లేదు. `చెబితే అవ‌మానం` అని భ‌య‌ప‌డ్డారు. కానీ ఆ భ‌యాల్ని వ‌దిలి.. బ‌య‌ట‌కు వ‌స్తున్నారు...

HOT NEWS

[X] Close
[X] Close