దేవుడి ఇమేజ్‌…సోనూలో క‌ల‌వ‌రం!

మ‌న హీరోల్ని దేవుడిగా చూడ‌డం అబిమానుల‌కు అల‌వాటే. వాళ్ల కోసం… గుళ్లో పూజ‌లు చేస్తుంటారు. క‌టౌట్ల‌కు పాలాభిషేకాలు మామూలే. ఇక హార‌తులు, కొబ్బ‌రికాయ కొట్ట‌డాలూ రొటీన్ వ్య‌వ‌హారాలు. అయితే చాలా త‌క్కువ మంది హీరోల‌కు మాత్రమే గుళ్లు క‌ట్టారు. దేవుడ్ని చేశారు. ఇప్పుడు అలాంటి ఇమేజ్ సోనూసూద్ సొంత‌మైంది. ఉత్త‌రాదిన ఒక్కో రోజు, ఒక్కో ఊరిలో సోనూ సూద్ గుళ్లు వెలుస్తున్నాయి. క‌నీసం దేవుడి గుళ్లో సోనూసూద్ ఫొటోలుపెట్టి, పూజ‌లు చేయ‌డ‌మైనా క‌నిపిస్తోంది. తెర‌పై ప్ర‌తినాయ‌కుడిగా న‌టించిన ఓ న‌టుడికి… ఇలాంటి గౌర‌వం ద‌క్క‌డం బ‌హుశా… భార‌తీయ చిత్ర‌సీమ‌లో ఇదేతొలిసారి కావొచ్చు.

అయితే ఈ ఇమేజ్ సోనూని క‌ల‌వ‌ర‌పెడుతోంది. `నేనుఅందుకు అర్హుడిని కాదు.` అని అభిమానుల‌కు చెబుతున్నా – లోలోప‌ల మాత్రం టెన్ష‌న్ ప‌ట్టుకుంటోంది. ఎందుకంటే సోనూ ఇమేజ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఎప్ప‌టిలా విల‌న్ వేషాలు వేస్తే.. జ‌నం చూస్తారా, లేదా? అనే భ‌యం ప‌ట్టుకుంది. ఇది వ‌ర‌కైతే.. ఎలాంటి పాత్ర అయినా చేసేవాడు. ఇప్పుడు ఆచి తూచి ఎంచుకోవాలి. విల‌న్ వేషాలుకొద్ది రోజులుమానేయాలి. అది…న‌టుడిగా త‌న‌ని తాను నియంత్రించుకోవ‌డ‌మే అవుతుంది. ద‌ర్శ‌కులలో కూడా.. సోనూని ఇలాంటి పాత్ర‌ల్లో చూపించ‌డం క‌రెక్ట్‌కాదేమో అనే అనుమానాలు మొద‌ల‌వుతాయి. సోనూ కి వ‌చ్చిన కొత్త ఇమేజ్ తో ఆయ‌న కోసం పాజిటీవ్ పాత్ర‌లు సృష్టించొచ్చు. రెండు మూడు సినిమాల్లో హీరోగానూ మార్చేయ‌వ‌చ్చు. అయితే… సోనూ దేహాకృతి, శ‌రీర భాష‌.. విల‌న్ పాత్ర‌ల‌కు అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతాయి. కొన్నాళ్లు ఆ పాత్ర‌ల‌కు దూరం కావడం సోనూ.. కెరీర్‌ని ఇబ్బంది పెట్టే విష‌య‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చైతన్య : జగన్‌ను ముంచేస్తున్న న్యాయసలహాదారులు..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న పళంగా.. తన న్యాయబృందం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఆయనను న్యాయవ్యవస్థకు బద్ద వ్యతిరేకిగా తీర్చిదిద్దేలా.. ఆయన న్యాయ సలహాదారులు.. ఇతర బృందం... తీసుకుంటున్న...
video

‘ఖిలాడీ’ ఎంట్రీ ఇచ్చేశాడు!

https://www.youtube.com/watch?v=uFi-NFk09xk&feature=youtu.be క్రాక్‌తో సూప‌ర్ హిట్టు కొట్టాడు ర‌వితేజ‌. అంత వ‌ర‌కు వ‌చ్చిన ఫ్లాపుల‌న్నీ... `క్రాక్‌`తో మ‌ర్చిపోయేలా చేశాడు. త‌న‌కు అచ్చొచ్చిన యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో త‌న‌కు తిరుగులేద‌ని నిరూపించాడు. మ‌రోసారి... ఖిలాడీతో.. అలాంటి ప్ర‌య‌త్న‌మే చేయ‌బోతున్నాడు....

కలకలం రేపుతున్న లైంగిక నేరాలపై బాంబే హైకోర్టు తీర్పు ..!

భారతదేశ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటోంది. ఇలాంటి సమయంలో కొన్ని అవాంఛనీయమైన వ్యవహారాలపై చర్చ జరుగుతోంది. అలాంటి వాటిలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒకటి ఉండటం... విషాదమే. లైంగిక వేధింపుల కేసు విషయంలో...

క్రైమ్ : హైదరాబాద్ సైకో.. ఒంటరి మహిళ కనిపిస్తే హత్యే..!

మన చుట్టూనే తిరుగుతూంటారు. మామూలుగానే ఉంటారు. కానీ వారి గురించి నిజాలు తెలిసినప్పుడే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలాంటి నేరస్తుడొకరు హైదరాబాద్ పోలీసులకు పట్టుబడ్డారు. ఓ కేసు విషయంలో ప్రశ్నిస్తే.. తానేం తప్పు చేయలేదన్నట్లుగా...

HOT NEWS

[X] Close
[X] Close