సోనూసూద్‌కి ఘ‌న స్వాగ‌తం

ఈ క‌రోనా కాలంలో.. రియ‌ల్ హీరోగా మారిపోయాడు సోనూసూద్‌. క‌ష్టాల్లో ఎవ‌రున్నా స‌రే, నేనున్నా అంటూ ఆప‌న్న‌హ‌స్తం అందించాడు. అక్కున చేర్చుకున్నాడు. వ‌ల‌స కూలీల పాలిట దేవుడిగా మారిపోయాడు. ఏ రాజ‌కీయ నాయ‌కుడూ చేయ‌ని సాయం.. సోనూసూద్ రూపంలో అందింది. అందుకే.. సోనూ ఇప్పుడు హీరో అయిపోయాడు.

సుదీర్ఘ విరామం త‌ర‌వాత‌… షూటింగ్ సెట్లో అడుగు పెట్టిన సోనూసూద్‌కి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ప్ర‌స్తుతం ఆయ‌న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ న‌టిస్తున్న `అల్లుడు అదుర్స్‌`లో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. సోమ‌వారం సోనూ సెట్లో అడుగుపెట్టారు. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ సోనూని సాద‌రంగా ఆహ్వానించింది. ప్ర‌కాష్ రాజ్ శాలువా క‌ప్పి, అభినందిస్తూ, సోనూని సెట్లోకి ఆహ్వానించారు. ఓ న‌టుడికి ఈ త‌ర‌హా ఆహ్వానం ప‌ల‌క‌డం, ఈమ‌ధ్య కాలంలో చూళ్లేదు. సంతోష్ శ్రీ‌న్‌వాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో సోనూ – ప్ర‌కాష్ రాజ్ మ‌ధ్య కొన్ని స‌న్నివేశాల్ని పూర్తి చేయాల్సివుంది. దాంతో పాటు పాట‌లూ చిత్రీక‌రిస్తే ఈ సినిమా పూర్త‌యిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రభుత్వ పెద్దల సన్నిహితుల చానల్‌లో మంత్రి వ్యతిరేకత వార్తల అర్థమేంటి..?

తెలంగాణకు చెందిన ఓ మంత్రి రాసలీలలంటూ తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అధీనంలో ఉన్న న్యూస్ చానల్ హంగామా ప్రారంభించడం టీఆర్ఎస్‌లో కలకలం రేపుతోంది.కొద్దీ రోజులుగా ఆ...

కళ్ల ముందు కనిపిస్తున్న ఇళ్లతో టీడీపీ రాజకీయం..!

పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తామంటూ హడావుడి చేసిన వైసీపీ సర్కార్... ఏడాదిన్నర గడిచిపోయినా ఆ దిశగా కనీసం అడుగులు వేయలేకపోయింది. ఆ పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న అభిప్రాయం...

క్రైమ్ : అత్త – అల్లుడు – వివాహేతర బంధం- హత్య..

సమాజంలో చిత్రమైన నేరాలు అప్పుడప్పుడూ వెలుగుచూస్తూ ఉంటాయి. అలాంటిది హైదరాబాద్‌లో ఒకటి బయటపడింది. ఓ నడి వయసు మహిళ.. ఓ యువకిడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తాను పెళ్లి చేసుకోలేదు కనుక.. కూతుర్ని...

యుద్ధం మొద‌ల‌వ్వ‌క‌ముందే.. తెల్ల‌జెండా ఊపేసిన ర‌జ‌నీ!

క‌రోనా ఎంత ప‌ని చేసిందో? క‌రోనా వ‌ల్ల సినిమా షూటింగులు ఆగిపోయాయి. సినిమా విడుద‌ల‌లూ ఆగిపోయాయి. ఆఖ‌రికి... ఓ సూప‌ర్ స్టార్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికీ బ్రేకులు ప‌డ్డాయి. ఆ స్టార్...

HOT NEWS

[X] Close
[X] Close