మూడు మ్యాచ్‌ల వన్డే సీరిస్‌లో టీమిండియాపై రెండో వన్డేలో సఫారీలు విజయం సాధించారు. 359 పరుగుల టార్గెట్ ఎదురుగా ఉన్నా సఫారీలు కంగారుపడలేదు. మొదటి వన్డేలోలా ఒత్తిడికి గురవలేదు. ఆరంభంలో వికెట్ పడినా.. సింపుల్ గా లక్ష్య చేదన దిశగా దూసుకెళ్లారు. నాలుగు వికెట్ల తేడాతో విజయం సాదించారు.
ఓపెనర్ మార్కరమ్ చేజింగ్ ను లీడ్ చేశారు. తొలి వికెట్ 26 పరుగుల వద్దే పడినా ఒత్తిడికి గురి కాలేదు..తర్వాత వచ్చిన బావుమా, మాధ్యుస్, బ్రేవిస్ తో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పారు. 110 పరుగులు కొట్టి ఔటయ్యే సరికే మ్యాచ్ దక్షణాఫ్రికా చేతుల్లోకి వచ్చేసింది. మొదటి వన్డేలో గెలిపించడానికి చివరి వరకూ ప్రయత్నించి విఫలమైన బాష్ ఈ సారి మాత్రం తప్పు జరగనీయలేదు. ఫినిషింగ్ బాధ్యత తీసుకుని సింపుల్ గా లక్ష్యాన్ని చేర్చి.. సిరిస్ ను 1-1తో సమం చేశాడు.
అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాటర్లు రుతురాజ్‌గైక్వాడ్, విరాట్ కోహ్లీ సెంచరీలతో రెచ్చిపోయారు. రుతురాజ్ గైక్వాడ్ 77 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. 105 పరుగులు వద్ద అవుట్ అయ్యాడు. తర్వాత విరాట్ కోహ్లీ 90 బంతుల్లో సెంచరీ చేశాడు. తర్వాత స్కోరు పెంచే క్రమంలో 102 పరుగులకు అవుట్ అయ్యాడు. తన ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, రెండు సిక్స్‌లు కొట్టాడు. కేఎల్ రాహుల్ కూడా రాణించడంతో .. భారత్ దక్షిణాఫ్రికాకు 359 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. కానీ ఇది సరిపోలేదు.
మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్లోమరో మ్యాచ్ మిగిలి ఉంది. శనివారం, విశాఖపట్నంలో జరుగుతుంది. విశాఖలో సిరీస్ ఫలితం తేలనుంది.
