దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ప్రపంచ చాంపియన్గానిలిచింది. ఏళ్లుగా గెలవలేకపోతున్న ట్రోఫీని దక్కించుకుంది. అయితే ఇప్పుడు గెల్చుకుంది టెస్ట్ ప్రపంచకప్. లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఈ టైటిల్‌ను సాధించారు. దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. వారు 282 పరుగుల లక్ష్యాన్ని కాస్త టెన్షన్ పడినా సాధించారు.
దక్షిణాఫ్రికా మొట్టమొదటి ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్‌ను గెల్చుకుంది. ఈ విజయంతో వారిపై ఉన్న “చోకర్స్” ట్యాగ్ పోయినట్లయింది. ప్రధాన టోర్నమెంట్లలో కీలక మ్యాచ్‌లలో ఒత్తిడి వల్ల దక్షిణాఫ్రికా టీం ఓడిపోతూ ఉంటుంది. అందుకే ఆ పేరు వచ్ింది. దక్షిణాఫ్రికా WTC సైకిల్లో 12 మ్యాచ్‌లలో 69.44 శాతం పాయింట్లతో టాప్‌లో నిలిచింది. ఆస్ట్రేలియా 67.54 శాతంతో రెండో స్థానంలో సరిపెట్టుకుంది.
దక్షిణాఫ్రి వెస్ట్ ఇండీస్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్‌పై విజయాలతో రాణించింది. పాకిస్తాన్‌పై సెంచూరియన్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌లో 2 వికెట్ల తేడాతో నాటకీయ విజయంతో ఫైనల్‌కు అర్హత సాధించారు. ఆస్ట్రేలియా, 2023లో ఇండియాను ఓడించి డిఫెండింగ్ చాంపియన్‌గా ఫైనల్‌కు చేరుకుంది. కానీ దక్షిణాఫ్రికా బౌలింగ్ , మార్క్రమ్, బవుమా బ్యాటింగ్ ముందు తల వంచక తప్పలేదు.
దక్షిణాఫ్రికా విజయం ఓ సుదీర్గ స్వప్నం. అందుకే టెస్ట్ క్రికెట్ ఫైనల్ ను ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చూశారు. ఓ దశలో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. వికెట్లు పడిపోతాయేమో అనుకున్నారు. కానీ మార్కరమ్.. గాయంతోఉన్న బ్యాటింగ్ చేసిన కెప్టెన్ బావుమా.. తమ దేశానికి టెస్ట్ ప్రపంచకప్ ను అందించారు.