దక్షిణ భారత రియల్ ఎస్టేట్ దిగ్గజాల దృష్టి ఆంధ్రప్రదేశ్ వైపు పడుతోంది. రియల్ ఎస్టేట్ కాంక్లేవ్లు, రియల్ ఎస్టేట్ రంగంలో అవార్డు ప్రధానోత్సవాలు ఎక్కడ జరిగినా ఏపీ రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. నవంబర్ ఒకటిన హైదరాబాద్ లో జరిగిన ఓ రియల్ ఎస్టేట్ లీడర్ల అవార్డుల కార్యక్రమంలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల రియల్ ఎస్టేట్ భవిష్యత్తుపై రియల్ ఎస్టేట్ డెవలపర్ల మధ్య విస్తృత చర్చజరిగింది.
ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో సస్టైనబుల్ సిటీలు, కార్బన్ ఎమిషన్స్ తగ్గించే ప్రాజెక్టులు, రెగ్యులేటరీ రిఫార్మ్స్ వంటి అంశాలు హైలైట్ అయ్యాయి. ET Now ఆధ్వర్యంలో నిర్వహించినఈ కాంక్లేవ్‌లో దిగ్గజాలు పాల్గొన్నారు. ప్యానెల్ డిస్కషన్లు, కీనోట్ సెషన్లు, నెట్వర్కింగ్ సెషన్ల ద్వారా రియల్ రంగం వృద్ధికి అవసరమైన సహకారాలు, రెగ్యులేటరీ రిఫార్మ్స్, ఫైనాన్షియల్ స్ట్రాటజీలు చర్చించారు.
కాన్క్లేవ్లో ఆంధ్రప్రదేశ్ మార్కెట్ ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో అమరావతి రాజధాని ప్రాజెక్టు పునఃప్రారంభం, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ఇన్ఫ్రా డెవలప్మెంట్, NRI పెట్టుబడులు మార్కెట్ బూస్ట్‌కు కారణాలుగా విశ్లేషిచారు. ఏపీలో గ్రీన్ బిల్డింగ్ ప్రాక్టీసెస్, కార్బన్ ఎమిషన్స్ తగ్గించే ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. అమరావతి వంటి స్మార్ట్ సిటీలలో రెన్యూవబుల్ ఎనర్జీ, వాటర్ మేనేజ్మెంట్, వేస్ట్ రీసైక్లింగ్ ఇంటిగ్రేషన్ అవసరమని నిపుణులు సూచించారు. CREDAI నేషనల్ ప్రెసిడెంట్ గుమ్మి రామ్ రెడ్డి మాట్లాడుతూ, “ఏపీ మార్కెట్లో సస్టైనబుల్ ప్రాజెక్టులు 20-30% ROI ఇస్తాయి. ప్రభుత్వం గ్రీన్ సర్టిఫికేషన్లకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలన్న సూచనలు ఏపీ ప్రభుత్వానికి వచ్చాయి.
