కోలుకుంటున్న బాలు

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌.పి. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్యం క్షీణించింద‌న్న వార్త‌లు రావ‌డంతో.. యావ‌త్ చిత్ర‌సీమ ఉలిక్కిప‌డింది. ఆయ‌న ఆరోగ్యం బాగుండాల‌ని, క్షేమంగా తిరిగిరావాల‌ని అభిమానులంతా ప్రార్థించారు. ఆ ప్రార్థ‌న‌లు ఫ‌లిస్తున్నాయి. బాలు ఆరోగ్యం క్ర‌మంగా కుదుట ప‌డుతోంది. గురువారం ఆయ‌న ఆరోగ్య‌ప‌రిస్థితి విష‌మించ‌డంతో… వైద్యులు ఐసీయూలో చేర్చారు. అప్ప‌టితో పోలిస్తే….శుక్ర‌వారం రాత్రి ఆయ‌న ప‌రిస్థితి కొంచెం మెరుగ‌య్యింది. బాలు కోలుకుంటున్నార‌ని, చికిత్స‌కు ఆయ‌న స్పందిస్తున్నార‌ని బాలు కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఆయ‌న ఆరోగ్యం గురించి ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంకయ్య నాయుడు ప్ర‌త్యేకంగా ఆరా తీశారు. వైద్యుల‌తో మాట్లాడి ప‌రిస్థితిని స‌మీక్షించారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకుంటార‌ని, ఇది వ‌ర‌క‌టిలా పాట‌లు పాడి అల‌రిస్తార‌ని ఆశాభావం వ్యక్తం చేశారు వెంక‌య్య నాయుడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close