మ‌రేం ఫ‌ర్లేదు.. ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్ వ‌స్తోంది

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ నుంచి ఎన్టీఆర్ పుట్టిన రోజున టీజర్ వ‌స్తుంద‌ని ఆశ ప‌డ్డారు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌. కానీ… టీజ‌ర్ విడుద‌ల చేయ‌డం కుద‌ర‌డం లేద‌ని చిత్ర‌బృందం చెప్పేసింది. దాంతో.. ఎన్టీఆర్ అభిమానులు కాస్త నిరాశ చెందారు. అయినా ఫ‌ర్వాలేదు. ఎన్టీఆర్ బ‌ర్త్ డే గిఫ్ట్ ఉంది. కాక‌పోతే.. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ టీమ్ నుంచి కాదు. ‘ఫ‌ల‌క్‌నామా దాస్‌’ నుంచి.

ఫ‌ల‌క్‌నామా దాస్, హిట్ చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న యువ క‌థానాయ‌కుడు విశ్వ‌క్‌సేన్ ఎన్టీఆర్ కోసం ఓ రాప్ సాంగ్ విడుద‌ల చేస్తున్నాడు. ‘మాస్ కా దాస్‌, మాస్ కా బాప్‌’ పేరుతో సాగే ఈ గీతాన్ని ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా బుధ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల చేస్తున్నాడు. స్వ‌త‌హాగా విశ్వ‌క్ సేన్ ఎన్టీఆర్ ఫ్యాన్‌. ఎన్టీఆర్‌పై త‌న ఇష్టాన్ని ఈ పాట రూపంలో చూపించుకోబోతున్నాడు. సో.. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ టీజ‌ర్ లేని లోటు.. ఈ పాట‌తో కొంత వ‌ర‌కూ తీరొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close