విశాఖలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కాదు ఓటు బ్యాంకుకు ఇళ్ల స్థలాలు..!

ఆంధ్రప్రదేశ్‌కు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నంను చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న ప్రభుత్వం… దానికి తగ్గట్లుగా “లుక్” ఉండే ప్రాజెక్టులన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి రద్దు చేసుకుంటూ పోతోంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను క్యాన్సిల్ చేస్తోంది. ఓ మెట్రో నగరం రూపునకు కావాల్సిన.. గత ప్రభుత్వం ప్రారంభించిన పనులను ఎక్కడికక్కడ నిలిపివేస్తోంది. ఈ ఖాతాలో తాజాగా అగనంపూడి స్పోర్ట్స్ కాంప్లెక్స్ చేరింది.

స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను రద్దు చేసి ఇళ్ల స్థలాలుగా పంచేస్తారట..!

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో గత ప్రభుత్వం స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంకల్పించింది. భూమి కూడా కేటాయించింది. ఇప్పుడా భూమిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టాల్సిన ప్రభుత్వం ఉన్న పళంగా… ఆ ప్రతిపాదనలన్నింటినీ రద్దు చేసింది. భూమి కేటాయింపు కూడా రద్దు చేసింది. గత ప్రభుత్వం శాప్‌కు 80 ఎకరాలు కేటాయించింది. మొత్తంగా 150 ఎకరాల్లో నిర్మించాలని నిర్ణయించడంతో.. మరో 75 ఎకరాలు కేటాయించాల్సి ఉంటుంది. అయితే కొత్త ప్రభుత్వం హఠాత్తుగా ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రతిపాదననే రద్దు చేసేసింది. ఆ స్థలాన్ని ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీంతో షాక్‌కు గురి కావడం విశాఖ వాసుల వంతయింది.

అమరావతిలాగే స్పోర్ట్స్ కాంప్లెక్స్ విషయంలో అవంతి మాట మార్చాల్సిందే..!

విశాఖలో మెట్రో నగరంగా ఎదుగుతున్న సిటీ. దేశంలోని అన్ని ప్రముఖ రాష్ట్రాల నుంచి ప్రజలు అక్కడికి వచ్చి నివాసం ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు పెద్ద ఎత్తున ఉండటమే దీనికి కారణం. ఇలాంటి సిటీలో క్రీడా సౌకర్యాలు పెద్దగా అభివృద్ధి చెందలేదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు… ఏం జరిగినా హైదరాబాద్‌నే కేంద్రంగా చేసేవారు. విభజన తర్వాతనే విశాఖపై దృష్టి పెట్టారు. ఏపీలో ఏదైనా ప్రతిష్టాత్మక పోటీ జరగాలంటే.. విశాఖలోనే అన్నట్లుగా… భారీ క్రీడా సముదాయ నిర్మాణానికి సంకల్పించారు. ఈ ప్రాజెక్ట్ వైసీపీ నేతల్ని కూడా ఆకట్టుకుంది. విశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్.. అగనంపూడిలో అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తామని ఎప్పుడు ప్రెస్‌మీట్‌ పెట్టినా.. చెబుతూ ఉంటారు. అయితే.. ఇప్పుడు ఆయన… గతంలో అమరావతి విషయంలో తీసుకున్న యూటర్న్‌లాగే… ఇప్పుడు స్పోర్ట్స్ కాంప్లెక్స్ విషయంలోనూ మాట మార్చక తప్పదు.

విశాఖకు ఇదేం కష్టం..!?

అగనంపూడిలో 80 ఎకరాల స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ స్థలాన్ని తీసుకుని వేరే చోట కేటాయిస్తామని ప్రభుత్వం వైపు నుంచి లీకులు వస్తున్నాయి. దానికి కొంత సమయం పట్టవచ్చని అంటున్నారు. అయితే… ఆ ఇచ్చే స్థలమే పేదలకు పంచవచ్చు కదా.. శాప్‌కి ఇచ్చి మరీ వెనక్కి తీసుకోవడం ఎందుకు అనే చర్చ నడుస్తోంది. ఇళ్ల స్థలాలివ్వడానికి.. అమ్మి సొమ్మి చేసుకోవడానికి కూడా విశాఖలోని కీలకమైన స్థలాలనే ప్రభుత్వం ఎంచుకుంటోంది. ఇప్పటికే.. ఆదాని డేటా సెంటర్ కు ఇచ్చిన భూములు రద్దు చేయడంతో ఆ సంస్థ హైదరాబాద్ వెళ్లిపోయింది. లూలూ ప్రాజెక్ట్ ఒప్పందం రద్దు చేయడంతో.. ప్రపంచ స్థాయి మాల్, కన్వెన్షన్ విశాఖకు కాకుండా పోయింది. ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా కలగా మిగిలిపోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close