ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో ‘నారీ నారీ నడుమ మురారి’ ఒకటి. శర్వానంద్ కథానాయకుడిగా నటించారు. ఈ సినిమా శర్వా కెరీర్‌కి చాలా కీలకం. అందుకే అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొన్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి.. సంక్రాంతి సీజన్‌కి పర్ఫెక్ట్ అని చిత్రబృందం భావించింది. అందుకే.. కాంపిటీషన్ గట్టిగా ఉన్నా, సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ప్రమోషన్స్ ఇంకా మొదలు పెట్టలేదు. సోమవారం నుంచి ఈ హడావుడి ఉండొచ్చు.
మరోవైపు ఈ సినిమాలో ఓ స్పెషల్ ఎట్రాక్షన్ చేరింది. ఇందులో శ్రీవిష్ణు అతిథి పాత్రలో మెరవబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఓ చిన్న వీడియో కూడా రిలీజ్ చేసింది. సామజవరగమణ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకుడు. ఆ సినిమాలో శ్రీవిష్ణు హీరోగా నటించిన సంగతి తెలిసిందే. శర్వానంద్ తో శ్రీవిష్ణుకి మంచి రాపో ఉంది. అందుకే ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి ముందుకొచ్చాడు శ్రీవిష్ణు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. సంక్రాంతి సీజన్ శర్వాకి బాగా కలిసొచ్చింది. ఈ సీజన్లో రెండు హిట్లు కొట్టాడు శర్వా. ఈసారి కూడా హిట్టు కొడితే… హ్యాట్రిక్ హీరో అయిపోతాడు.


