శ్రీ‌విష్ణు క‌ష్టం.. `అల్లూరి` పాలు

శ్రీ‌విష్ణు చాలా ఇష్ట‌ప‌డి, క‌ష్ట‌ప‌డి చేసిన సినిమా అల్లూరి. ఈ సినిమాపై శ్రీ‌విష్ణు చాలా న‌మ్మ‌కాలు పెట్టుకొన్నాడు. భారీ ఎత్తున ప్ర‌మోష‌న్ చేశాడు. త‌న కెరీర్‌ని కొత్త దారిలోకి తీసుకెళ్తుంద‌ని భావించాడు. కానీ.. ఫ‌లితం రివ‌ర్స్ అయ్యింది. ఈసినిమా కోసం శ్రీ‌విష్ణు క‌ష్ట‌ప‌డిన విధానం ఒక ఎత్త‌యితే, ఈ సినిమా విడుద‌ల కోసం శ్రీ‌విష్ణు ప‌డిన శ్ర‌మ మ‌రో ఎత్తు. శుక్ర‌వారం ఈ సినిమా విడుద‌ల అన‌గా.. గురువారం నిర్మాత బెక్కం వేణుగోపాల్ చేతులు ఎత్తేశారు. ఆయ‌న గ‌త సినిమాల అప్పులు.. వెంటాడాయి. దాంతో శ్రీ‌విష్ణు రంగంలోకి దిగాల్సివ‌చ్చింది. అప్ప‌టిక‌ప్పుడు రూ.2 కోట్ల మేర వెన‌క్కి ఇచ్చి, ఎన్‌.ఓ.సీ తెచ్చుకొని, సినిమాని రిలీజ్ చేశాడు. ఈ సినిమా నిర్మాణానికీ, శ్రీ‌విష్ణుకీ ఎలాంటి సంబంధం లేదు. అసలు బెక్కం వేణుగోపాల్ అనే నిర్మాత‌కు గ‌తంలో అప్పులు ఉన్నాయ‌న్న సంగ‌తి కూడా తెలీదు. మ‌రో హీరో అయితే.. `సినిమా రిలీజ్ అయితే నాకేంటి, అవ్వ‌క‌పోతే నాకేంటి` అని వదిలేసేవాడు. కానీ శ్రీ‌విష్ణు మాత్రం అలా చేయ‌లేదు. త‌న పూచీక‌త్తుతో సినిమాని విడుద‌ల చేయించాడు. ఇంతా చేసినా `అల్లూరి`కి స‌రైన రిజ‌ల్ట్ రాలేదు. సినిమా కోసం తెర‌పై, రిలీజ్ అవ్వ‌డానికి బ‌య‌టా త‌ను ప‌డిన క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం ద‌క్క‌లేదు. బ్యాడ్ టైమ్ అంటే ఇలానే ఉంటుందేమో..?!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వివేకా కేసులో సీబీఐ సైలెంట్ – పులివెందుల కోర్టు యాక్టివ్ !

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎక్కడి వరకు వచ్చిందో ఎవరికీ తెలియదు. సీబీఐ బృందాలు ఏం చేస్తున్నాయో తెలియదు. విచారణను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలన్న పిటిషన్ పై...

వైసీపీలోకి గంటా ! నిజమా ? బ్లాక్‌మెయిలింగా ?

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని హఠాత్తుగా ఆయన అనుచరులు మీడియాకు లీకులు ఇచ్చారు. డిసెంబర్ ఒకటో తేదీన గంటా శ్రీనివాస్ బర్త్ డే అని ఆ రోజున ప్రకటన...

ఢిల్లీలో కాదు.. తెలంగాణలోనే కేసీఆర్ సభలు !

వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా బీఆర్ఎస్‌గా మారనుంది. డిసెంబర్ రెండో వారంలో ఢిల్లీలో భారీ బహిరంగసభ పెడతామని బీఆర్ఎస్ తరపున మీడియాకు లీకులొచ్చాయి. కానీ కేసీఆర్ మాత్రం...

హిట్ 2లో.. హిట్ 3 హీరో!

ఏ సినిమాకైనా ర‌న్ టైమ్ చాలా కీల‌కం. సినిమా బాగున్నా.... నిడివి పెరిగితే `బాబోయ్‌` అంటున్నారు. అందుకే ఈ విష‌యంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు చాలా జాగ్ర‌త్త‌గా ఉంటున్నారు. సీన్లు ఎంత బాగున్నా -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close