ఈ సారి నేచురల్ నటుడిపై ఎక్కుపెట్టిన శ్రీరెడ్డి

రోజుకొకరి మీద విల్లు ఎక్కుపెడుతున్న శ్రీరెడ్డి మరొక నటుడి పై వాగ్బాణాలు సంధించింది. ఈ మధ్య “కొమ్ములు తిరిగిన శేఖరుడు” అంటూ శేఖర్ కమ్ముల మీద విరుచుకుపడటమూ, ఆయన రివర్స్ లో ఫైర్ అయ్యే సరికి శ్రీరెడ్డి మాట మార్చడమూ తెలిసిందే. ఇప్పుడు కొత్తగా “నేచురల్” నటుడి పై అభాండాలు వేసింది.

ఇంతకీ శ్రీరెడ్డి ఏమందంటే – ‘‘నీవు రియల్ లైఫ్‌లో కూడా చాలా బాగా నటిస్తావు. ఆన్ స్క్రీన్‌లో చాలా నేచురల్‌గా నటిస్తావు. నేచురల్‌గా కనిపిస్తావు. కానీ అది నీ మాస్క్. నీవు నీ లైఫ్‌లో చాలా స్ట్రగుల్ అయ్యానని ఎప్పుడూ చెబుతావు. కానీ అది ప్రజల నుంచి సానుభూతి పొందడం కోసమే. నీకంటే తాతలు, తల్లిదండ్రుల సపోర్ట్ ఉన్న పెద్ద హీరోలు బెటర్. వారంతా మంచి సభ్యతా సంస్కారం కలగిన వారు. చరణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌ వంటి గొప్ప కో స్టార్స్‌ను చూసి నేర్చుకో. వారెవరికీ గర్వం లేదు. కానీ నువ్వు చాలా యాటిట్యూడ్ చూపిస్తావు. నువ్వు చిన్న డైరెక్టర్‌లను, ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వస్తున్న వారిని గౌరవించవు. చాలా బ్యాడ్ యాటిట్యూడ్‌తో నీవు సక్సెస్ అయ్యావు. నీకు ఇటీవలే కొడుకు పుట్టాడు. చాలా చాలా అభినందనలు. కానీ జీవితంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండు. నీవు ఎంతో మంది అమ్మాయిలను వాడుకున్నావు. నీ కారణంగా బాధింపబడిన వారు ఇప్పటికీ ఏడుస్తున్నారు. దేవుడు ఎప్పుడూ న్యాయం వైపే ఉంటాడు గుర్తుంచుకో. కాకపోతే శిక్షించడానికి కొంచెం టైమ్ పట్టొచ్చు. కానీ నువ్వు బాధపడతావు. తప్పకుండా ఇండస్ట్రీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటావు. ఇండస్ట్రీ నుంచి ఇలాంటివి ఈకలా రాలిపోవాలి.’’

నేరుగా పేరు చెప్పకుండా, ఎప్పటిలాగే ఈసారి కూడా యండమూరి నవలల తరహాలో బోలెడు క్లూస్ ఇచ్చింది – “నేచురల్‌గా నటిస్తావు”, “లైఫ్‌లో చాలా స్ట్రగుల్ అయ్యానని ఎప్పుడూ చెబుతావు”, “ఇటీవలే కొడుకు పుట్టాడు”, “ఈక” – ఇవన్నీ ఆ క్లూస్ లో భాగమే. అయితే నిన్న శేఖర్ కమ్ముల ఫైర్ కాగానే, “పాఠకుల వినోదం కోసం ఏదో బెడ్ టైం స్టొరీస్ చెబుతూంటాను” అన్న శ్రీరెడ్డి ఈ సారి కూడా అలాగే బెడ్ టైం స్టోరీస్ చెప్పిందా లేక ఇదైనా నిజమా అన్న అనుమానాలున్నాయి పాఠకులకి. ఒకవేళ ఇవన్నీ ఆమె చెప్తున్నట్టు స్టోరీసే గనుక అయితే ఆమెకి నటిగా కంటే రచయిత్రిగా మంచి భవిష్యత్తు ఉండొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com