బాబాకి`గంధం బొట్టు’ పెట్టకూడదా !?

షిర్డీ సాయిబాబా వారి నుదిటిమీద గంధం బొట్టు పెట్టకూడదనీ, అలా చేస్తే బాబా మండిపడతారని మొదట్లో సాయి భక్తులు చాలామంది అనుకునేవారు. తాత్యా సాహేబు, దాదా భట్టు సహా ఎవ్వరూ ఈ పనికిసాహసిచేవారుకారు. మరి అలాంటప్పుడు సాయికి చందనాదులతో పూజ చేసేటప్పుడు ఆయన విగ్రహం నుదిటిమీద గంధం బొట్టు ఎందుకు పెడుతున్నారు? అయినప్పటికీ బాబా ఎవ్వరిపై ఆగ్రహం చూపడంలేదే ! గంధం వలె చల్లగా, శాంతంగా ఉంటూ భక్తుల కోరికలను తీరుస్తూనే ఉన్నారుగా. మరి ఇందులోని పరమార్థం ఏమిటో తెలుసుకోవాలంటే, బాబావారి జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన గురించి చెప్పుకోవాలి. ఆ సంఘటన అనంతరం వారి నుదిటమీద గంధం బొట్టు కనిపించడం మొదలైంది.

సాయిబాబావారు ఏనాడూ తనకు పూజలు చేయమని చెప్పలేదు. తనకు ఇలాంటి ఆసనమే కావాలని కోరలేదు. వారు నిత్యముక్తులు. ఆనందమయులు. ఎప్పుడూ చిన్మయరూపులు. అలాంటి వారికి ఆసనం ఏమి అవసరం? అందునా వెండి సింహాసనం !! కానీ భక్తుల ముచ్చటను బాబా కాదనేవారుకారు. అదో చక్కటి బంధం. భక్తునికీ, భగవంతునికీ మధ్య ఉండే సున్నితమైన పరమానందభరితమైన బంధం. ఏనాటిదో ఒక పాత గోనెసంచీ ముక్కపై బాబావారు కూర్చునేవారు. అదే వారికి నిజమైన సింహాసనం. కానీ భక్తుల మనస్సు చివుక్కుమనేది. దీంతో అంతా కలసి ఆయన కూర్చోవడానికి చక్కటి గద్దె నిర్మించారు. అలాగే బాబావారు ఆనుకోవడానికి అనుకూలంగా ఉండేలా గోడకు ఒక తలగడ ఉంచేవారు. బాబా అడ్డుచెప్పేవారుకాదు. ఎందుకంటే భక్తులు ఆనందంగా ఉండటమే వారికి కావాల్సినది. భక్తుల భావాలకు అనుగుణంగా, అన్ని విధాలా సకల పూజోపచారాలను స్వీకరించేవారు.

అయితే, నుదిటమీద గంధం బొట్టు మాత్రం పెట్టనిచ్చేవారు కారు. శివలింగానికి పెట్టినట్లుగా కొందరు భక్తులు తమ బొటన వ్రేలితో అడ్డంగా విబూది రేఖలు పెడితే ఏమీ అనేవారు కారు. ఎవరైనా గంధం బొట్టు పెట్టాలనుకుంటే ఆ పని పూర్తయ్యేదికాదు. కంఠానికి గంధం పూసినా ఊరుకునేవారు. ప్రశాంతంగా చిరునవ్వులు చిందించేవారు. అలాంటిది, ఓ సంఘటన విచిత్రంగా జరిగింది.

ఒకసారి తాత్యాసాహేబు నూల్కర్ స్నేహితుడైన డాక్టర్ పంత్ అనే భక్తుడు సాయిదర్శనానికి షిర్డీ వచ్చారు. ఈ భక్తుడు ఏ విధమైన సంకోచాలు లేకుండా, అక్కడున్న చందనం గిన్నె తీసుకుని బాబావారి నుదిటమీద త్రిపుండ్రరేఖలు దిద్దాడు. `ఇక ఇతను బాబావారి కోపం రుచిచూడాల్సిందే..’ అనుకున్నారు అంతా. కానీ, అందుకు విరుద్ధంగా బాబా శాంతంగా ఉండిపోయారు. ఇలా ఎలా జరిగిందో బాబావారినే అడిగి తెలుసుకోవాలనుకున్నాడు మరో భక్తుడు దాదా భట్టు. బాబావారు సందేహం తీరుస్తూ, `ఇతని గురువు బ్రాహ్మణుడు. నన్ను తన గురువువలె భావించి పూజలు చేశాడు’ అని చెప్పారు. ఆ తర్వాత మరో విషయం దాదా భట్టుకు తెలిసింది, అదేమంటే, ధోపేశ్వర్ లో రఘునాధ్ అన్న సిద్ధుడు కాకా పురాణిక్ అన్న పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆయన్ని గురువుగా నిత్యం భావిస్తూ ఈ పంత్ పూజలు చేస్తుండేవాడు. గురువుగారి నుదిటిపై గంథం బొట్టు పెట్టేవాడు. సాయిని కూడా తన గురువుగానే భావించిన పంత్ షిర్డీలో అదే మోస్తరుగా పూజలు చేశాడు. ఏమాత్రం సంకోచించకుండా గంధం గిన్నె తీసుకుని బాబావారి నుదిట బొట్టు పెట్టాడు. సాయిదేవుడ్ని గరువుగా సంపూర్ణ విశ్వాసంతో భావించాడు కనుకనే ఆ శిష్యునిచేత బాబావారు కూడా తన నుదిటమీద కూడా గంధం బొట్టు పెట్టించుకున్నారు.

ఆ సంఘటన దరిమిలా, బాబావారి నుదిటమీద గంధం బొట్టు సాక్షాత్కరించింది. అలా గురుశిష్యుల బంధంగా గంధం బొట్టు శాశ్వతంగా నిలిచిపోయింది. బాబావారికి కొన్ని ఇష్టం లేకపోయినా, భక్తుల ఆనందం కోసం అంగీకరించేవారు. అంతటి ప్రేమమూర్తి శ్రీ షిర్డీ సాయిబాబా.

( భక్త హేమాడ్ పంత్ విరచిత శ్రీ సాయి సచ్చరిత గ్రంథంలోని 11వ అధ్యాయనం నుంచి ఈ సంఘటన తీసుకోబడినది)

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close