శ్రీమంతుడుకి డోకా లేదు, కానీ…

మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా ఈరోజు విడుదలయింది. సినిమా విడుదలకు ముందు నుంచే చాలా మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకొంది. శ్రీమంతుడు సినిమా గురించి మహేష్ బాబు చాలా గొప్పగా చెప్పారు. పైగా దానిని ‘మిర్చి’ తో హిట్ కొట్టిన కొరటాల శివ దర్శకత్వం వహించడంతో అంచనాలు మరింత భారీగా పెరిగిపోయాయి. దానికి వస్తున్న ఆ ‘హైప్’ చూసి శ్రీమంతుడు బాహుబలిని దెబ్బేసేస్తాడేమోనని చాలామంది కంగారు పడిపోయారు కూడా. కానీ సినిమా రివ్యూలు చూసాక శ్రీమంతుడుని చూసి బాహుబలి మరీ అంత టెన్షన్ పడనవసరంలేదని స్పష్టం అవుతోంది.

శ్రీమంతుడు గురించి క్లుప్తంగా చెప్పుకొంటే హీరో కోటీశ్వరుడి కొడుకు. కానీ అతనికి కోటు వేసుకోవలనే ఆసక్తి కూడా ఉండదు. ఇక తండ్రి సంపాదించిన కోట్ల రూపాయలపై ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది? అందుకే చాలా సింపుల్ గా ఉండాలనుకొంటాడు. తెలుగు సినిమా ఫార్ములా ప్రకారం హీరోయిన్ తో లవ్వులో పడగానే ఆమె అతనికి కర్తవ్యం భోదిస్తుంది. అప్పుడు అతనికి తన ఊరిని ఉద్దరించాలని అర్ధమవుతుంది. సాధారణంగా అటువంటప్పుడు ఆ ఊరు విలన్ చేతిలోనే ఉంటుంది కనుక మహేష్ బాబు ఊరు కూడా సంపత్ రాజు అనే విలన్ చేతిలోనే ఉంటుంది. ఇంతవరకు చెపితే మిగిలిన కధను జనాలే చెప్పేయగలరు. ఒకవేళ ఆ ఊరు విలన్ చేతిలో కాకుండా చాలా మంచి వ్యక్తి చేతిలో ఉండి ఉంటే అప్పుడు శ్రీమంతుడు ఏమి చేసేవాడో చూపించి ఉంటే బాగుండేది.

కానీ మహేష్ బాబు సినిమాలో ఓ నాలుగు ఫైట్లు పడకపోతే కిక్కు రాదు గాబట్టి ఊరి పెద్ద విలన్ అయ్యి ఉండక తప్పదు. అలాగే శృతి హాస్సన్ వంటి అందగత్తెని పెట్టుకొని మహేష్ బాబు ఊరిని ఉద్దరిస్తూ కూర్చుంటే ఎవరూ చూస్తూ కూర్చోలేరు. కనుక హీరోయిన్ తో ఓ ఐదారు పాటలు తప్పలేదు. అంటే తెలుగు సినిమా ఫార్ములా ప్రకారం పడవలసినవన్నీ సమపాళ్ళలోనే పడ్డాయి. కనుక సినిమాకి డోకా లేదని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్ల లవ్వుతో సాగదీసి, సెకండ్ హాఫ్ లో నాలుగు ఫైట్స్, మూడు ఇమ్మోషనల్ సీన్స్ తో ముగించేసాడు దర్శకుడు కొరటాల.

ఈ సినిమాలో మహేష్ బాబు క్యారక్టరైజేషన్, అతని నటన చాలా బాగుంది. కెమెరా, సంగీతం కూడా బాగుంది. మిగిలినవన్నీ రొటీన్. కాకపోతే మన తెలుగు సినీ ఇండస్ట్రీ చేసుకొన్న అదృష్టం ఏమిటంటే తెలుగు సినీ ప్రేక్షకులు అపరిచితుడు వంటి ఊహించలేని కధలేవో చూడాలని తపించిపోరు. ఉన్నదానినే మళ్ళీ కొత్తగా చూపించగలిగితే చాలని తృప్తిపడే అల్పసంతోషులు. పైగా కోటీశ్వరుడు అయిన హీరో అంత సింపుల్ గా వ్యవహరిస్తూ, తను సెంటు రాసుకోకపోయినా జనాల కోసం డబ్బు ఎడాపెడా అలాగా ఖర్చు పెట్టేస్తుంటే తెగ త్రిల్ అయిపోతారు. అందుకే ఇప్పుడు త్రిల్ అయిపోతూ శ్రీమంతుడిని మరింత శ్రీమంతుడుగా చేస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close