కమెడియన్ హీరోగా మారుతున్నాడంటే భయపడాల్సివస్తోంది. వాళ్ల ట్రాక్ రికార్డ్ అంత ఘోరంగా ఉంది. సునీల్ ఏదో ఆరంభంలో ఒకట్రెండు హిట్లు అందుకొన్నాడు గానీ.. ఆ తరవాత ఆయన గారి సినిమాలన్నీ ఫట్ ఫట్ మంటూ దీపావళి బాంబుల కంటే ఘోరంగా పేలిపోతున్నాయి. మొన్న విడుదలైన ఈడు గోల్డెహె.. సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దాంతో కమెడియన్ హీరో గా సినిమా అంటే.. హడలిపోతున్నారంతా. ఈ ట్రెండ్ ని కొనసాగిస్తూ.. మరో కమెడియన్ శ్రీనివాసరెడ్డి కూడా హీరో అయిపోయాడు. జయమ్ము నిశ్చయమ్ము అంటూ ఆయనతో ఓ సినిమాతీస్తున్నారిప్పుడు. పూర్ణ హీరోయిన్. మరీ హీరో అన్నామని ఓవర్ బిల్డప్పులు ఇవ్వకుండా.. చాలా కూల్‌గా కామ్ గా కనిపిస్తున్నాయి ప్రచార చిత్రాలు. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయ్యింది. ఇప్పుడు బిజినెస్ కూడా క్లోజ్ అయ్యింది. ఈసినిమాని హోల్ సేల్‌గా రూ.7 కోట్లకు కొనేసుకొన్నారు. శ్రీనివాసరెడ్డికి ఇంత సీన్ ఉందా అని చిత్రసీమ ఆశ్చర్యపోతోందిప్పుడు. ఈ సినిమాని రూ.3.5 కోట్లతో తీశారని టాక్. అంటే.. విడుదలకు ముందే మరో మూడున్నర వచ్చిందన్నమాట. సునీల్‌తో సినిమా తీస్తే డబ్బులే రావడం లేదు. అలాంటిది శ్రీనివాసరెడ్డి జాక్ పాట్ కొట్టేశాడు. పనిలో పనిగా ఈసినిమా కొన్న బయ్యర్లకూ నాలుగు డబ్బులు మిగిలితే… సునీల్ ప్లేస్‌ని శ్రీనివాసరెడ్డి రిప్లేస్ చేయడం ఖాయం.