ఓ హీరోయిన్ ‘ఈగో’ క్లాష్‌!

స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఓ క‌థానాయిక ఆమె. పైకి చాలా ప‌ద్ధ‌తిగా క‌నిపిస్తుంది. అంద‌రితోనూ క‌లిసి మెల‌సి ఉంటున్న‌ట్టు పోజు కొడుతుంది. కానీ ఆమెకున్నంత ఈగో ఎవ్వ‌రికీ లేద‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. అది మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది.

ఓ అగ్ర నిర్మాతతో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోందామె. సినిమా దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఈసినిమాలో మ‌రో ప‌వ‌ర్ ఫుల్ ఫిమేల్ క్యారెక్ట‌ర్ ఉంది. ఓ స్టార్ హీరో త‌న‌య ఈ పాత్ర పోషిస్తోంది. దాదాపుగా లేడీ విల‌న్ టైపు పాత్ర అది. ఈ హీరోయిన్‌, ఆ లేడీ విల‌న్ ల మ‌ధ్య ఓ సీన్ తీశారు ఇటీవ‌ల‌. ఆ సీన్‌లో త‌న కంటే.. విల‌న్ కాస్య్టూమ్సే బాగున్నాయ‌ని ఆ హీరోయిన్ అలిగి వెళ్లిపోయింద‌ట‌. ఆ తర‌వాత కో డైరెక్ట‌ర్ ని త‌న కార్ వాన్‌లోకి పిలిచి, చ‌డామ‌డా తిట్టిపోసింద‌ట‌. ఈ ర‌భ‌తో ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ అయ్యింద‌ని తెలుస్తోంది. ఈ హీరోయిన్ కార్‌వాన్ లో రంకెలు వేయ‌డం, సెట్లో అంద‌రికీ తెలిసిపోయింది. ఆ లేడీ విల‌న్‌కి కూడా. దాంతో ఇద్ద‌రి మ‌ధ్యా మాట‌లు లేకుండా పోయాయ‌ని తెలుస్తోంది. కెమెరా ముందు.. ఆ కొద్దిసేపూ న‌టిస్తూ, షాట్ ఓకే అయిపోయిన త‌ర‌వాత‌, ఎవ‌రి దారిలో వాళ్లు వెళ్లిపోతున్నార‌ని, ఈ కోల్డ్ వార్ ని టీమ్ కూడా.. భ‌రించ‌లేక‌పోతోంద‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బోల్డ్ గా భయపెట్టిన లైగర్

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్ షూటింగ్ దాదాపు పూర్తయింది. తాజగా లైగర్ నుండి ఒక స్టన్నింగ్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఈ...

ఎన్టీఆర్ కథ గోపిచంద్ కు

దర్శకుడు హరి మాస్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. 'సింగం' ఆయన సక్సెస్ఫుల్ సిరిస్. ఈ సిరిస్ కి తెలుగులో కూడా ఆకట్టుకుంది. హరికి ఎప్పటి నుండో నేరుగా ఒక తెలుగు...

సీఎం జగన్ పేరుతో సైబర్ నేరాలు !

అప్పుడెప్పుడో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. కోట్లు కొట్టేయడానికి దర్జాగా కోల్‌కతా సూట్ కేస్ కంపెనీల పేరుతో చెక్‌లు జమ చేశారు. ఆ కేసు ఇంత వరకూ తేలలేదు. కానీ ఇప్పుడు...

ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ – పబ్లిసిటీ బడ్జెట్ కోట్లకు కోట్లే !

సోషల్ మీడియా సంస్థలకు.. మీడియా సంస్థలకు పండగ లాంటి సమయం ఇది. వద్దంటే రాజకీయ పార్టీలు కుప్పలు కుప్పలుగా ప్రకటనలు ఇస్తున్నాయి. రూ. కోట్లకు కోట్లు ఆదాయం తెచ్చి పెడుతున్నాయి. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close