‘సైజ్ జీరో’లో న‌టించిన స్టార్ సెలబ్రిటీస్

పివిపి బ్యాన‌ర్‌ఫై అనుష్క‌, ఆర్య ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టించిన చిత్రం సైజ్ జీరో. తెలుగు, త‌మిళ భాష‌ల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ చిత్రం న‌వంబ‌ర్ 27న గ్రాండ్ లెవ‌ల్‌లో విడుద‌ల‌వుతుంది. ఈ చిత్రం క్యారెక్ట‌ర్ అనుష్క 20 కిలోల బ‌రువు పెర‌గ‌డం అనుష్కకు సినిమాల ప‌ట్ట ఉన్న క‌మిట్‌మెంట్‌ను తెలియ‌జేసింది. అనుష్క ఇలాంటి డిఫ‌రెంట్ రోల్ చేయ‌డంతో సినిమాపై ప్రేక్ష‌కుల్లో, ట్రేడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తి పెరిగింది. ఈ చిత్రంలో ప‌లు సినీ సెల‌బ్రిటీలు ముఖ్య‌పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున‌, రానా ద‌గ్గుబాటి,రంగం హీరో జీవా స‌హా హీరోయిన్స్ హ‌న్సిక‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, త‌మ‌న్నా, శ్రీదివ్య‌, రేవ‌తి, మంచు ల‌క్ష్మి త‌దిత‌రులు స్పెష‌ల్ అప్పియ‌రెన్స్‌లో క‌న‌ప‌డ‌నున్నారు. ఇంత మంది సినీ సెల‌బ్రిటీలు ఈ చిత్రంలో స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ చేయ‌డానికి కార‌ణం ఆర్య‌,అనుష్క‌ల‌తో వారికున్న స్నేహ సంబంధమే కాకుండా పెద్ద నిర్మాణ సంస్థ అయిన పివిపి బ్యాన‌ర్‌తో ఉన్న ప్రొఫెష‌న‌ల్ రిలేష‌న్ షిప్‌.

అనుష్క‌, నాగార్జున న‌టించిన సూప‌ర్ చిత్రంతో తెరంగేట్రం చేసింది. అప్ప‌టి నుండి నాగ్‌తో అనుష్కకు మంచి స్నేహ సంబంధాలున్నాయి. అలాగే జీవా, హ‌న్సిక‌లు ఆర్య‌కు మంచి ఫ్రెండ్స్‌. అలాగే శ్రీదివ్య ప్రస్తుతం ఆర్యతో త‌మిళ బెంగ‌ళూర్ డేస్ రీమేక్‌లో న‌టిస్తుంది. వీరంతా ఈ చిత్రంలో న‌టించ‌డం ప‌ట్ల చాలా హ్య‌పీగా ఉన్నారు.

సైజ్ జీరో చిత్రం వెయిట్ లాస్‌కు సంబంధించిన కాన్సెప్ట్‌తో తెర‌కెక్కింది. మ‌నిషి బాహ్య సౌంద‌ర్యం కంటే అంత‌ర్గ‌త సౌంద‌ర్యం చాలా ముఖ్య‌మ‌ని చెప్పే ఈ సినిమాలో మ‌నిషికి అంత‌ర్గత సౌంద‌ర్యం ముఖ్య‌మ‌ని న‌మ్మే కాజ‌ల్‌, హ‌న్సిక‌లు, నేచుర‌ల్ బ్యూటీ మ‌నిషికి చాలా ముఖ్య‌మ‌ని న‌మ్మే రేవ‌తి కూడా ఇందులో న‌టించ‌డం ప‌ట్ల త‌మ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. అదే విష‌యాన్ని ఈ చిత్రంలో వీరు త‌మ మాటల్లో తెలియ‌జేస్తారు. ద‌ర్శ‌కుడు ప్ర‌కాస్ కోవెల‌మూడికి మంచి మిత్రులైన రానా ద‌గ్గుబాటి, మంచు ల‌క్ష్మిలు మ‌నిషికి అంతర్గ‌త సౌంద‌ర్య‌మే ముఖ్య‌మ‌ని న‌మ్ముతారు. వీరు కూడా ఈ సినిమాలో పార్ట్ కావ‌డం ప‌ట్ల చాలా హ్య‌పీగా ఉన్నారు.

ప్ర‌కాస్ కోవెల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో అనుష్క‌, ఆర్య ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో రూపొందింది. సినిమా ఫ‌స్ట్‌లుక్ నుండి మంచి అంచ‌నాలు క్రియేట్ చేసింది. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను ఇప్ప‌టికే రెండు మిలియ‌న్స్ ప్రేక్ష‌కులు వీక్షించారు. యం.యం.కీర‌వాణి అందించిన సంగీతం కూడా పెద్ద హిట్ట‌యిన ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాషల్లో నవంబ‌ర్ 27న విడుద‌ల‌వుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ ఎమ్మెల్యే కూడా పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చేశారు..!

వైసీపీలో చేరబోతున్నారని ప్రచారం జరిగిన రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా..ఖండించారు. తాను పార్టీ మారబోవడం లేదని ప్రకటించారు. ఎప్పటిలాగే తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. పార్టీలోని కొంత మంది వ్యక్తులు కూడా...

ఎస్ఈసీ ఆర్డినెన్స్‌పై హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ఏపీ సర్కార్..!

ఎస్ఈసీ అర్హతలు మార్చుతూ తెచ్చిన ఆర్డినెన్స్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ.. ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు కొనసాగుతున్నప్పటికీ...ఎస్ఎల్పీ దాఖలు...

శంకించొద్దు.. జగన్‌కు విధేయుడినే : విజయసాయిరెడ్డి 

తాను చనిపోయేవరకు జగన్‌కు, ఆయన కుటుంబానికి విధేయుడిగానే ఉంటానని.. నన్ను శంకించాల్సిన అవసరం లేదని ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా ముఖంగా వెల్లడించారు. వైఎస్ జగన్ కు... అత్యంత ఆప్తునిగా పేరు తెచ్చుకున్న ఆయన...

అమిత్‌షాతో భేటీకి మంగళవారం ఢిల్లీకి జగన్..!?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం అత్యవసరంగా ఢిల్లీకి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు మీడియా ప్రతినిధులకు అనధికారిక సమాచారం అందింది. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తారని.. కేంద్ర హోంమంత్రి అమిత్...

HOT NEWS

[X] Close
[X] Close