పట్టాలెక్కుతున్న అమరావతి “సీడ్ క్యాపిటల్”..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సీడ్ క్యాపిటల్ గా పిలుస్తున్న స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి పనులు ప్రారంభమవుతున్నాయి. అమరావతి ఆర్ధికాభ్యున్నతికి చోదకశక్తిలా ఉపయోగపడుతుందన్న ఉద్దేశ్యంతో ఏపీసీఆర్డీయే స్టార్టప్‌ ఏరియాను ప్రతిపాదించింది. రాజధానిలోని అత్యంత కీలక ప్రదేశంలో, కృష్ణానదీ తీరాన, సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు- గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లకు సమీపాన దీనికోసం 1691 ఎకరాలను కేటాయించారు. ఈ భూమిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి పరచడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య, ఆర్థిక సంస్థలను ఇక్కడికి రప్పించి ఆర్ధిక లావాదేవీలకు కేంద్రంగా చేయాలన్నది లక్ష్యం. దీని వల్ల రాజధాని ఆదాయం పెరగడమే కాకుండా పెద్ద సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. భూములను ఆకర్షణీయమైన రీతిలో అభివృద్ధి పరచి, మంచి ధరలకు విక్రయించే బాధ్యత కూడా స్టార్టప్‌ ఏరియా డెవలపర్‌దే. ఈ రూపంలో లభించే ఆదాయంలో 42 శాతాన్ని సింగపూర్‌ కన్సార్షియం సీఆర్‌డీఏకు ఇస్తుంది. స్టార్టప్‌ ఏరియా రాకతో ఒక్క అందులోనే కాకుండా అమరావతి వ్యాప్తంగా భూముల ధరలు గణనీయంగా పెరుగుతాయి.

మొత్తం 3 దశల్లో, 15 సంవత్సరాల కాలవ్యవధిలో సీడ్ క్యాపిటల్‌ను అభివృద్ధి పరచాలని ఒప్పందం చేసుకున్నారు. తొలి దశలోని 650 ఎకరాలను 5 ఏళ్లలో తీర్చిదిద్దాల్సి ఉంది. ఒప్పందం ప్రకారం ఈ దశలో ఒక్కొక్కటి 8 లక్షల చదరపుటడుగుల ఆఫీస్‌ స్పేస్‌ను నిర్మించాల్సి ఉంది. ఇప్పుడు… ఆ పనులు ప్రారంభిస్తున్నారు. మొదటగా వెల్‌కం గ్యాలరీని నిర్మాణం ప్రారంభిస్తున్నారు.
ఇప్పటి వరకు సింగపూర్ సంస్ధలు 40 దేశాల్లో స్టార్ట్ అప్ ఎరియాలను అభివృద్ది చేశాయి. ఇవన్నీ లాభాల్లో ఉన్నాయి. ఏపీ సీడ్ క్యాపిటల్ అభివృద్ధిలో వచ్చే లాభాల్లో 45 శాతం ఏపీకి అందుతాయి.

సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తో పాటు 90 మందితో కూడిన బృందం అమరావతికి వచ్చింది. వీరంతా స్టార్టప్ ఎరియా పనులు ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొననున్నారు. అమరావతి డెవలప్‌మెంట్ పార్టనర్స్ పేరుతో కలసి పనిచేస్తారు. నిర్మాణం జరుపుకోనున్న వెల్‌కం గ్యాలరీలో 4వేల చదరపు మీటర్ల విస్తిర్ణం ఉంటుంది. సీడ్ క్యాపిటల్‌ పనుల్లో భాగంగా 50 ఎకరాల విస్తిర్ణంలో తోలి దశ పనులు ప్రాంరంభింనున్నారు అందులో.. కన్వెన్షన్ సెంటర్, పార్కులు తదితర నిర్మాణాలు ఉండనున్నాయి. రాజధానిలో ఇప్పటికే ప్రభుత్వ భవనాలు పనులు శరవేగంగా నడుస్తున్నాయి. సీడ్ క్యాపిటల్ పనులు కూడా ప్రారంభం కానుండటంతో.. మరింత వేగంగా.. అమరావతికి ఆకృతి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో విచారణకు ఆదేశించిన నిమ్మగడ్డ..!

స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో చేసిన వాస్తు మార్పులపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సీరియస్ అయ్యారు. ఎవరు చెబితే ఆ మార్పులు చేశారో తనకు తెలియాలంటూ..విచారణకు ఆదేశించారు. నిమ్మగడ్డ తన ఆఫీసులో జరిగిన...

అమరావతిని కొనసాగిస్తే పదవుల్ని ఇచ్చేస్తాం..! జగన్‌గు చంద్రబాబు ఆఫర్..!

అమరావతిని ఏకైక రాజధాని కొనసాగిస్తూ... ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే... తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పదవులను వదిలేస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు.. ముఖ్యమంత్రి జగన్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు...

జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్..!

జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాతి రోజే...అంటే జూన్ 13న హైదరాబాద్‌లో వారిని అరెస్టు చేసిన పోలీసులు అనంతపురంకు తరలించారు....
video

క‌ల‌ర్ ఫొటో టీజ‌ర్‌: బ్లాక్ అండ్ వైట్ కాంబో

https://www.youtube.com/watch?v=T-R3h9va2j4&feature=emb_title ప్రేమ గుడ్డిది. చెవిటిది. మూగ‌ది కూడా. దానికి ప్రేమించ‌డం త‌ప్ప బేధాలు తెలీవు. న‌ల్ల‌ని అబ్బాయి.. తెల్ల‌ని అమ్మాయి ప్రేమించుకోవ‌డం కూడా వింతేం కాదు. కానీ.. మ‌ధ్య‌లోకి ఓ పులి వ‌చ్చింది....

HOT NEWS

[X] Close
[X] Close