ఏపీలో రోజుకు మినిమం అరవై ..!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు రోజుకు కనీసం అరవై నమోదవుతున్నాయి. ఆపైన ఎనభై వరకూ.. లెక్కలు తేలుతున్నాయి. గత పది రోజులుగా ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. రోజుకు ఏడు వేల నుంచి పదివేల శాంపిళ్లను టెస్ట్ చేస్తున్నారు. పదివేల శాంపిళ్లు చేసినా.. అరవై దరి దాపుల్లోనే పాజిటివ్ కేసులు వస్తున్నాయి. అంత కంటే తక్కువ చేసినా.. అదే పరిస్థితి. మంగళవారం జరిపిన పరీక్షల్లో 60 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో.. మొత్తం ఏపీలో వీటి సంఖ్య 1777కి చేరింది. డిశ్చార్జ్ అయిన వారు.. మరణించిన వారు పోగా… యాక్టివ్ కేసుల సంఖ్య 1012గా ఉంది. నిన్న కొత్తగా నమోదైన కేసుల కన్నా డిశ్చార్జ్ అయిన వారే ఎక్కువగా ఉన్నారు.

తెలంగాణలో సింగిల్ డిజిట్‌లోనే.. పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో.. ఏపీతో పోలిస్తే.. అక్కడ యాక్టివ్ పాజిటివ్ కేసులు సగం మాత్రమే ఉన్నాయి. ఏపీ ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో ఒక్క తమిళనాడులో మాత్రం.. కరోనా విజృంభిస్తోంది. మిగిలిన చోట్ల.. తగ్గు ముఖం పట్టింది. ఏపీలో మద్యం దుకాణాలు ప్రారంభించడంతో.. తొలి రెండు రోజులు ఎవరూ భౌతిక దూరం పాటించలేదు. పైగా.. అన్ని రకాల సడలింపులు ఇవ్వడంతో.. కరోనా వ్యాప్తి అధికమవుతుందన్న అభిప్రాయం ఏర్పడుతోంది.

అధికారులు మరింత పటిష్టమైన చర్యలు తీసుకోనున్నారు. వలస కూలీలలతో పాటు.. పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి ఏపీ వాసులు తరలి వస్తున్నారు. ఈ కారణంగా ఏపీలో పాజిటివ్ కేసులు మరికొంత కాలం పెరుగుతూనే ఉంటాయని అంచనా వేస్తున్నారు. నిన్న ఇద్దరు కరోనా కారణంగా మరణించడంతో .. చనిపోయిన వారి సంఖ్య 36కి చేరింది. ఇది దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close