నో పర్మిషన్..! తెలంగాణలోనే స్టీఫెన్ రవీంద్ర..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. కేంద్రం వద్ద లాబీయింగ్ చేసుకున్నా.. స్టీఫెన్ రవీంద్రను… ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురాలేకపోయారు. స్టీఫెన్ రవీంద్ర డిప్యూటేషన్‌కు.. కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. దాంతో.. ఆయన మళ్లీ తెలంగాణలోనే ఐజీగా బాధ్యతలు స్వీకరించారు. మూడు నెలల పాటు.. ఆయన తెలంగాణలో.. ఐజీగా చేస్తున్న ఉద్యోగానికి సెలవు పెట్టి.. ఏపీలో ఇంటలిజెన్స్ చీఫ్ గా వెళ్లేందుకు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ… కేంద్రం ఆయన ఆశలపై నీళ్లు చల్లేసింది. స్టీఫెన్ రవీంద్రను ఏపీకి పంపడానికి నిరాకరించింది. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత… ప్రగతి భవన్ కు వెళ్లి కేసీఆర్ ను కలిసిన సమయంలో జగన్ అడిగిన మొదటి విషయం.. స్టీఫెన్ రవీంద్రను.. ఏపీకి పంపడం. కేసీఆర్ అంగీకరించి… లేఖ పంపినా.. కేంద్రం మాత్రం అడ్డుకట్ట వేసింది.

ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర, ఐఏఎస్ శ్రీలక్ష్మి. తెలంగాణ క్యాడర్‌కు చెందిన వీరిని.. ఏపీకి పంపాలని.. రకంగా.. ఏపీ సర్కార్.. కేంద్రంపై… తీవ్రమైన ఒత్తిడి తెచ్చింది. తెలంగాణ ప్రభుత్వం అంగీకరించి… ప్రక్రియ పూర్తి చేసినా.. వ్యవహారం డీవోపీటీ ఆపేసింది. నిబంధనలు కారణంగా చెబుతున్నప్పటికీ.. కేంద్రం మాత్రం.. ఈ అధికారుల్ని ఏపీకి పంపడానికి ఇష్టపడటం లేదు. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి విజయసాయిరెడ్డి… వారి కోసం.. లాబీయింగ్ చేయని రోజంటూ లేదు. తాము ఎన్ని విజ్ఞప్తులు చేసినా… కేంద్రం స్పందించకపోతూండటంతో.. నేరుగా.. విజయసాయిరెడ్డి.. స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మిని తీసుకుని ఓ సారి అమిత్ షాను మరో సారి ప్రధానిని కలిశారు. ఢిల్లీ పర్యటనలో.. జగన్మోహన్ రెడ్డి కూడా లాబీయింగ్ చేశారు. కానీ పని కాలేదు.

జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఓ వర్గం కోటరీ తయారవుతోందని.. ఇది కేంద్రానికి ఇష్టం లేదని చెబుతున్నారు. జగన్ సీఎం అవగానే.. ఇంటలిజెన్స్ చీఫ్ గా.. స్టిఫెన్ రవీంద్రకు.. సీఎంవోలో కీలక బాధ్యతలు.. శ్రీలక్ష్మికి వచ్చినట్లేనని చెప్పుకున్నారు. స్టీఫెన్ రవీంద్ర కూడా.. అప్పట్లోనే అమరావతికి వచ్చి జగన్ తో సమావేశమై.. పోలీసులతో సమీక్ష కూడా జరిపారు. తెలంగాణలో సెలవు పెట్టేశారు. కానీ ఏపీకి పంపడం జరిగే పని కాదని.. తేల్చడంతో… తెలంగాణలోనే మళ్లీ ఐజీగా విధుల్లో చేరిపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

న్యూ ఐడియా: ట్రైల‌ర్‌కీ టికెట్టు

ఎడారిలో ఇసుక అమ్మే తెలివితేట‌లు అచ్చంగా రామ్ గోపాల్ వ‌ర్మ సొంతం. ఓ సీ గ్రేడ్ షార్ట్ ఫిల్మ్ తీసి, దానికి వంద‌, రెండొంద‌లు టికెట్టు పెట్టి, ప్రేక్ష‌కుల నుంచి ఎంతో కొంత...

ఆర్ఆర్ఆర్ మరో లేఖ : భవన నిర్మాణ కూలీలకు సాయం ఏదీ..?

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం పేరుతో.. వారికి సంబంధించిన సొమ్మును ప్రభుత్వం రూ. 1364 కోట్లు వసూలు చేసిందని... అయినా ఈ సంక్షోభ సమయంలో.. వారిని ఎందుకు ఆదుకోవడం లేదని.. నర్సాపురం ఎంపీ...

డెడ్లీ వైరస్ : ఏపీలో మరో 43 మరణాలు..!

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండు రోజుల పాటు నమోదన మరణాలు.. 37, 43. అంటే.. రెండు రోజుల్లో 80 మందికిపైగా కోవిడ్ కారణంగా చనిపోయారు. ఈ స్థాయిలో మరణాలు రికార్డవడం.. కలకలం రేపుతోంది....

మ‌ణిర‌త్నంతో సూర్య‌

మ‌ణిర‌త్నం - సూర్య‌... సూప‌ర్ కాంబినేష‌న్‌. యువ సినిమాతో వీరిద్ద‌రూ మ్యాజిక్ చేశారు. ఇప్పుడు మ‌రోసారి క‌ల‌సి ప‌నిచేయ‌బోతున్నారు. సినిమా కోసం కాదు. వెబ్ సిరీస్ కోసం. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క సార‌థ్యంలో...

HOT NEWS

[X] Close
[X] Close