చంద్రబాబు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి అంటూ ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ (ఎడిఆర్) నివేదిక విడుదల చేసింది. అంతే కొంత మంది మీద పడిపోవడం ప్రారంభించారు. అసలు ఆ నివేదికలో ఏం చెప్పారు..?. అనేది కనీస పరిశీలన లేకుండా.. ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు చేయడం ప్రారంభించారు. సీబీఐ మాజీ డైరక్టర్ గా పని చేసి.. ఘోరమైన పనితీరు కారణంగా సుప్రీంకోర్టులో బెంచ్ మీద నిలబెట్టిన తరహా శిక్షను ఎదుర్కొన్న మాజీ ఐపీఎస్ అధికారి ఒకరు ఇంకా అతిగా స్పందించారు. చంద్రబాబును వ్యతిరేకించే వారికి ఇలాంటి వారి స్పందన ఎంతో హాయినిస్తాయి. నిజానికి చంద్రబాబు ఆస్తులు ఎలా వచ్చాయో మాత్రం ఎవరూ చెప్పారు.
చంద్రబాబు వ్యక్తిగత ఆస్తులు కేవలం 36 కోట్లు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ. 931 కోట్లు విలువ చేసే ఆస్తులతో అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా ఉన్నారని ఏడీఆర్ చెప్పింది. ఏడీఆర్ ప్రత్యేకంగా ఎలాంటి ప్రత్యేక సమాచారంతో ఈ నివేదిక విడుదల చేయలేదు. కేవలం ఎన్నికల అఫిడవిట్లలో ఉన్న సమాచారాన్ని మాత్రమే వెల్లడించింది. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం చంద్రబాబు స్థిర, చరాస్తులు కలిపి రూ. 36 కోట్లుగా నిర్దారించారు. కానీ ఆయన భార్య భువనేశ్వరి హెరిటేజ్ కంపెనీలో ప్రధాన వాటాదారుగా ఉన్నారు. హెరిటేజ్ షేర్ ను బట్టి కుటుంబ ఆస్తులను లెక్కించారు.
హెరిటేజ్ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ
33 ఏళ్ల క్రితం చంద్రబాబు ప్రారంభించిన హెరిటేజ్ కంపెనీని ఆయన భార్య భువనేశ్వరి వృద్ధిపథంలోకి తీసుకెళ్లారు. మూడుదశాబ్దాల క్రితమే పబ్లిక్ లిస్టింగ్ కు ఆ కంపెనీ వెళ్లింది. మూడు దశాబ్దాల కాలంలో కంపెనీ మంచి పనితీరు కనబరుస్తూ.. మార్కెట్ ను పెంచుకుంటూ వస్తోంది. ఫలితంగా కంపెనీ షేర్ వాల్యూ కూడా పెరిగింది. ఫలితంగానే ఆస్తులు పెరిగాయి. మరి ఏ రూపంలోనూ చంద్రబాబు ఆస్తులు పెరగలేదు. ఈ షేర్ వాల్యూ పెరగడం వల్ల చంద్రబాబు కుటుంబ ఆస్తులు భారీగా పెరిగినట్లుగా ఏడీఆర్ నివేదిక చెబుతోంది.
జగన్ ఆస్తులు ఎలా వచ్చాయి ?
గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఏపీ రిచ్చెస్ట్ సీఎం జాబితాలో ఆయన మొదటి స్థానంలో ఉన్నారు. అయితే ఇక్కడ నార్మలైజ్ చేయడానికి ప్రయత్నించేవారే ఉంటారు. హెరిటేజ్ కంపెనీ మూడున్నర దశాబ్దాలుగా అంచెలంచెలుగా ఎదుగుతూ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల నమ్మకాన్ని చూరగొంది. జగన్ రెడ్డి కంపెనీలకు కనీసం స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అర్హత కూడా లేదు. అవన్నీ బినామీ పేర్లు, సూట్ కేసు కంపెనీల పేర్లతో ఉండే ఆస్తులు. అందుకే జగన్ నిర్మోహమాటంగా తనకు టీవీలు, పేపర్లు లేవని చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు చాన్స్ వచ్చింది కదా అని.. చంద్రబాబును, జగన్ ను కలిపేసే అతి తెలివి ప్రదర్శించేవారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి కష్టపడి కంపెనీని నిర్మించడం… సూట్ కేసు కంపెనీలు పెట్టి పెట్టుబడులు సాధించడానికి తేడా తెలియదు. ప్రజల్ని తప్పుదోవ పట్టించి అవినీతి పరులకు మద్దతు తెలుపుతూ ఉంటారు.