`అంబేద్కర్ అసోసియేషన్’ అసలు కథ

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్ (ఏఎస్ఏ) ఏర్పడి, అది ఎదుగుతున్నకొద్దీ ఉద్యమస్ఫూర్తికూడా పెరుగుతూనే ఉంది. ఇదే అప్పుడప్పుడు ఇబ్బందులు సృష్టిస్తోంది. అంబేద్కర్ పేరిట ఈ విద్యార్థి సంఘం రెండు దశాబ్దాల క్రిందటనే ఏర్పాటైంది. 1993లో ఓ పదిమందో, పదిహేనుమందో విద్యార్థులు ఈ అసోసియేషన్ ను ఏర్పాటు చేశారు. అది నెమ్మదిగా పెరుగుతూ 2015కి చేరేసరికి 800 విద్యార్థుల బలాన్ని సంపాదించుకుంది. దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడ్డ రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల కూడా ఇదే అసోసియేషన్ కు చెందినవాడే. ఈ విద్యార్థి సంఘం గురించి మరింత సమాచారం…

– 1993లో మండల్ ఉద్యమం సమయంలోనే ఈ విద్యార్థి సంఘం పురుడుపోసుకుంది. ఆ సమయంలోనే యూనివర్శిటీ ఆప్ హైదరాబాద్ లోని విద్యార్థులు కులప్రాతిపదికగా విడిపోయారని చెప్పొచ్చు.

– అదే సమయంలో అగ్రకులాలకు చెందిన ఫాకల్టీ మెంబర్స్ పై ఒక వర్గం విద్యార్థులు ఫిర్యాదులు చేయడం మొదలైంది. అగ్రకులాలకు చెందిన పొఫెసర్స్, లెక్చరర్స్ తమపై వివక్ష చూపుతున్నారని బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఆరోపించడం ప్రారంభించారు.

– సరిగా అదే సమయంలోనే ఏబీవీపీ, ఎన్ఎయూఐ వంటి విద్యార్థి సంఘాల తీరుపైకూడా ఘాటైన విమర్శలు తలెత్తాయి.

– అంబేద్కర్ విద్యార్థి సంఘం ఏర్పాటైన కొత్తల్లో వారి కార్యకలాపాలన్నీ నామమాత్రంగానే ఉండేవి. దళితులను వివక్ష నుంచి రక్షించడం, మానవ హక్కులను కాపాడటం, మహిళా హక్కులను పరిరక్షించడం వంటి అంశాలపై వారు అప్పుడప్పుడు కార్యక్రమాలు నిర్వహించేవారు.

– ఈ విద్యార్థి సంఘం ఏర్పాటైన ఏడేళ్లకు అంటే 2000 సంవత్సరంలో అంతర్గత ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి క్యాంపస్ లో జరిగే విద్యార్థి సంఘాల ఎన్నికల్లో అంబేద్కర్ విద్యార్థి సంఘం భాగస్వామ్యం మొదలైంది.

– 2010లో ఏఎస్ఏ మరో విద్యార్థి సంఘమైన ఎస్ఎఫ్ఐతో పొత్తుపెట్టుకుని తొలిసారిగా క్యాంపస్ ఎన్నికల్లో పాల్గొన్నది.

– 2011-12 సంవత్సరానికి స్టూడెంట్స్ యూనియన్ కు దొంతా ప్రశాంత్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు.

– తాజా సంఘటనలో సస్పెండ్ అయిన ఐదుగురు స్కాలర్స్ లో రోహిత్ తో పాటుగా ఈ ప్రశాంత్ కూడా ఉన్నాడు.

– ప్రశాంత్ చాలా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటాడని క్యాంపస్ వర్గాలు చెబుతున్నాయి. తరచూ గొడవలకు దిగుతుంటాడని కూడా అంటున్నారు. అయితే, ఈమధ్యనే ఏఎస్ఏ అధ్యక్షునిగా ఎన్నికైన రాంజీ మాత్రం ప్రశాంత్ కానీ, సస్పెండ్ అయిన మిగతా వారుకానీ ఎప్పుడూ సమస్యలు సృష్టించలేదని చెబుతున్నారు. ఏబివిపీ వాళ్లు పనికట్టుకుని వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని రాంజీ అంటున్నమాట.

– ఏబివిపీనే నిజానికి తరచూ చిన్నచిన్న విషయాలపై గొడవకు దిగుతున్నదన్నది అంబేద్కర్ విద్యార్థి సంఘం ఆరోపణ. ఈ రెండు విద్యార్థి సంఘాల సభ్యుల మధ్య అడపాదడపా చిన్నచిన్న ఘర్షణలు జరిగినా ఎప్పుడూ పరిస్థితి చేయిదాటలేదని రాంజీ అంటున్నారు.

– ఇతనే రోహిత్ కు ఐదు నెలలుగా 40వేల దాకా అప్పుఇచ్చినట్లు తెలుస్తోంది.

– యూనివర్శిటీలో తీవ్రవాద నీడలు పరుచుకున్నాయన్న ఆరోపణలు వినబడుతున్నాయి. జాతి విద్రోహచర్యలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదుల కారణంగానే కేంద్ర మంత్రులు (దత్తాత్రేయ, స్మృతి ఇరాని) తీవ్రంగా స్పందించారని అంటున్నారు.

– 2013నాటి ముజాఫర్ నగర్ దాడుల సంఘటనపై తీసిన డాక్యుమెంటరీ (ముజాఫర్ అభీ బాకీ హై) చూడటంతో ఏబీవిపీ వాళ్లు దాడులకు పాల్పడ్డారనీ, వారిలో ఒకరైన సుశీల్ కుమార్ తన ఫేస్ బుక్ ఖాతాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఏఎస్ఏ అధ్యక్షుడు రాంజీ అంటున్నారు.

– గట్టిగా గొడవ పడేసరికి, సుశీల్ కుమార్ బలవంతాన సారీ చెప్పాడనీ, అయితే అతని ఇగో దెబ్బతినడంతో ఈ సమస్యను పెద్దది చేశాడని రాంజీ చేస్తున్న వాదన.

– ఉగ్రవాది యాకుబ్ ఉరితీతకు వ్యతిరేకంగా తమ సంఘం నిరసన తెలిపినట్లు ఏబివిపీ చిత్రీకరించిందనీ, నిజానికి తాము కఠినమైన ఉరిశిక్ష విధానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తూ నిరసన తెలిపామన్నది రాంజీ వాదన. చివరకు ఈ వివాదం రోహిత్ ఆత్మహత్యకు దారితీసింది.

– ఇక ఏబివిపీ వాదన మరోలా ఉంది. తాము అంబేద్కర్ విద్యార్థి సంఘానికి వ్యతిరేకులం కాదనీ, దళితుల అభ్యున్నతిని తాము కోరుకుంటున్నామనీ, అయితే అది అవలంభిస్తున్న అవాంఛనీయ విధానాలను మాత్రం వ్యతిరేకిస్తున్నామని అంటోంది. సమానత్వసాధన కోసమంటూ అవాంఛనీయ సంఘటనలకు పాల్పడటం శోచనీయమని ఏబీవిపీ జనరల్ సెక్రటరీ కృష్ణ చైతన్య అంటున్నారు.

– రాజకీయ భావజాలంతో పాటుగా కులవాదన కూడా ప్రభలంగా పనిచేస్తుండటంతోనూ, రాజకీయ అండదండలు ఉండటంతోనూ తాము ఏం చేసినా బయటపడగలమన్న ధీమా విద్యార్థి సంఘంలో పెరిగిపోయింది. ఇది చివరకు బరితగింపు ధోరణికి దారితీసింది. అసలు సమస్య చిన్నదే అయినా దానికి రాజకీయ, కుల కార్డులు ప్లే చేస్తూ జాతీయ సమస్యగా మార్చేశారు. చివరకు క్యాంపస్ ని కులపరంగా రెండుగా చీల్చిపారేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close