విద్యార్థిని ఆత్మహత్య : అందరికీ మోహన్‌బాబే గుర్తొస్తున్నారు..!

ఒంగోలు క్విస్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని తేజశ్రీ ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి కారణం ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇవ్వకపోవడం. తండ్రి ఫీజు కట్టడం కోసం ఐదు రూపాయలు.. పది రూపాయల వడ్డీకి తెచ్చి వారితో మాటలు పడటం చూడలేక.. తానే భారమయ్యాయనని ప్రాణం తీసుకుంది. ఈ ఘటన ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా సంచలనాత్మకం అవుతోంది. రెండేళ్ల నుంచి ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్‌మెంట్ చెల్లించడం లేదు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన కొద్ది బకాయిల్ని చెల్లించిన తర్వాత.. ఇక నుంచి కాలేజీలకు రీఎంబర్స్ మెంట్ లేదని.. నేరుగా విద్యార్థుల ఖాతాల్లో వేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకూ వేసిన పాపాన పోలేదు. దీంతో కాలేజీలన్నీ విద్యార్థుల వద్ద ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నాయి.

తేజశ్రీ ఆత్మహత్యపై ముందుగా చంద్రబాబు స్పందించారు. ప్రభుత్వం ఏం చేస్తోంది? ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఏమైంది?.. నాడు- నేడు అంటూ కబుర్లు చెబుతూ విద్యావ్యవస్థను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు బకాయిలు రాలేదు కాబట్టి పరీక్షలకు అనుమతించమని.. కాలేజీ యాజమాన్యాలు చెబుతుంటే విద్యార్థులు మానసిక క్షోభకు గురవుతున్నారు.. పేద విద్యార్థుల ఫీజుల బకాయిలను తక్షణమే చెల్లించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలోనూ తేజశ్రీ ఆత్మహత్య అంశం హాట్ టాపిక్‌గా మారింది. అయితే అందరూ మోహన్ బాబునే గుర్తు చేసుకుంటున్నారు.

గత ఎన్నికలకు ముందు ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు ప్రభుత్వం ఇవ్వడం లేదని… ఆయన తన కాలేజీ విద్యార్థుల్ని తీసుకుని రోడ్డుపై పడుకుని ప్రదర్శన చేశారు. నిజానికి అప్పట్లో ప్రభుత్వం రెగ్యులర్‌గా చెల్లిస్తోందని..ఆ త్రైమాసికానికి సంబంధించిన చెల్లింపుల ప్రక్రియ నడుస్తోందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అయినా ఆయన ఏ ఉద్దేశంతో చేశారో కానీ ఆందోళన చేశారు. చేయాల్సిన ఆరోపణలు చేశారు. తర్వాత వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఆయన ఏమీ మాట్లాడటం లేదు. ఓ ఇంటర్యూలో ఇప్పుడూ తనకు ఫీజు రీఎంబర్స్ మెంట్ రావడం లేదని… ఆస్తులు తాకట్టు పెట్టుకున్నానని బాధపడ్డారు. కానీ ఆయనకు రావాల్సిన ప్రయోజనం వచ్చి ఉంటుంది కాబట్టి సైలెంట్ గా ఉంటున్నారని.. ఇతర కాలేజీల గురించి ఎందుకు పట్టించుకోరన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పందించాల్సింది మోహన్ బాబే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ బీజేపీకి దారి చూపిన రఘురామకృష్ణరాజు !

వైసీపీ సర్కార్‌పై ఎలా పోరాడాలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ బీజేపీ నేతలకు దారి చూపారు. ఆ దారిలో సోము వీర్రాజు అండ్ బృందం విమర్శలు ప్రారంభించారు. వైఎస్ జగన్‌కు డబుల్,...
video

బంగార్రాజు నుంచి బ్యూటీఫుల్ మెలోడీ

https://www.youtube.com/watch?v=d9eINA5rgzI సంక్రాంతి బరికి సిద్దమౌతున్న మరో సినిమా నాగార్జున 'బంగార్రాజు'. సోగ్గాడే చిన్ని నాయనాకు ఫ్రీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాగచైతన్య కూడా ప్రధాన పాత్ర పోహిస్తున్నాడు. ఇప్పటికే చైతు పై విడుదల...

వేరే మహిళలకు లేనివి నాకేమైనా ఉన్నాయా ? : పాయల్

ఓ ఫోటో షూట్ విషయంలో తనను ట్రోలింగ్ చేస్తున్న వారికి హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కడిగిపడేసింది. వేరే మహిళలకు లేనివి తనకు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించింది. ఎందుకంటే ఇటీవల పాయల్ రాజ్‌పుత్...

“బియ్యం”పై ఇరుక్కుపోయిన టీఆర్ఎస్ ! వాట్ నెక్ట్స్ ?

వరి ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ చాలా రాజకీయం చేస్తోంది. స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగారు. కేంద్రం కొనబోమని ఎప్పుడూ చెప్పలేదని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. కానీ ఎంత కొంటామో చెప్పాలంటూ...

HOT NEWS

[X] Close
[X] Close