డబ్బులన్నీ లాక్కుని కుక్కను కొట్టినట్లు కొట్టారు!

హైదరాబాద్: ర్యాగింగ్ భూతానికి అత్యంత ప్రతిభావంతుడైన తెలుగు విద్యార్థి ఒకరు బలయ్యాడు. చెన్నైలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ సత్యభామ యూనివర్సిటీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న వెంకటకృష్ణ అనే విద్యార్థి నిన్న రాత్రి హైదరాబాద్ కూకట్‌పల్లిలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్‌లో తన ఆత్మహత్యకు కారణాలను వెల్లడించాడు. సీనియర్‌లు పూర్ణ చంద్రశేఖర్, సూర్య అనేవారి వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొ న్నాడు. వారు తనను కుక్కను కొట్టినట్లు కొడుతున్నారని, డబ్బులన్నీ లాక్కుంటున్నారని రాశాడు. వారికి ఎలాగైనా శిక్ష పడేలా చూడాలని తల్లిదండ్రులను కోరాడు.

తమ కుమారుడు వెంకటకృష్ణ మెరిట్ స్టూడెంట్ అని, గూగుల్ అంబాసిడర్‌గా కూడా ఎంపికయ్యాడని తండ్రి చెప్పారు. గూగుల్ వారు నెలకు రు.15,000 ఇస్తారని, తానుకూడా ఇక్కడనుంచి డబ్బు పంపేవాడినని, అదంతా ఆ సీనియర్‌లు లాక్కుంటారని తమకు ఇప్పుడు తెలిసిందని తండ్రి వాపోయారు. దీపావళి సెలవులకోసం ఇంటికి వచ్చాడని అనుకున్నామని, అమ్మా, నాన్న, అన్నయ్యల ప్రేమకోసమే హైదరాబాద్ వచ్చానని సూసైడ్ నోట్‌లో రాశాడని తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి దర్శనం రోజుకు ఐదు వేల మందికే..!?

తిరుమల గతంలోలా భక్తులతో కళకళలాడటం సాధ్యమేనా..? ఒక్కో భక్తుని ఆరు అడుగుల సోషల్ డిస్టెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తూ.. రోజుకు పదివేల మందికి అయినా దర్శనం చేయించగలరా..? లఘు దర్శనం..మహా లఘ దర్శనం...

ఎనిమిదో తేదీ నుంచే అమరావతి రైతుల “మరో పోరాటం”..!

అమరావతి రైతులు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించుకున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ...ప్రత్యక్ష ఉద్యమాలకు దూరంగా ఉన్న రైతులు.. మధ్యలో భూముల్ని ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలనుకున్న...

సర్కారు వారి లాయర్లకు పిటిషన్లు వేయడం కూడా రాదా..!?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తొలగిస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంలోనూ తడబడింది. తీర్పు వచ్చిన మూడు రోజుల తర్వాత..స్టే కోరుతూ..సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్...

నాగబాబు హింసను ప్రేరేపించే ట్వీట్స్ చేస్తున్నాడా?

జనసేన నేత మరియు మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల చేస్తున్న ట్వీట్స్ వివాదాస్పదం అవుతున్నాయి. ఇటీవల చేసిన గాడ్సే ట్వీట్ మీద కొన్ని మీడియా సెక్షన్స్ నాగబాబుని చీల్చి చెండాడేశాయి‌. అయినా కూడా...

HOT NEWS

[X] Close
[X] Close