కాంగ్రెస్ లీడర్ సుబ్బరామిరెడ్డి కుటుంబానికి గాయత్రి ప్రాజెక్ట్స్ అనే కంపెనీ ఉంది. చాలా కాంట్రాక్టులు చేపట్టారు. ఆ పనులు చేయడానికి బ్యాంకుల వద్ద వేల కోట్లు తీసుకున్నారు. ఆ ప్రాజెక్టులు చేశారు. కానీ బ్యాంకులకు డబ్బులు కట్టలేదు. అలా అప్పులు పేరుకుపోయాయి. చేసిన పనులకు వచ్చిన డబ్బులతో అప్పులు ఎందుకు తీర్చలేదో .. అవన్నీ ఎటు పోయాయో తెలియదు. చివరికి బ్యాంకులు తమ డబ్బులు తాము తీసుకునేందుకు ఆ సంస్థను అంటే.. గాయత్రి ప్రాజెక్ట్స్ వేలం వేయాలని నిర్ణయించుకున్నాయి.
సుబ్బరామిరెడ్డి కుటుంబం అడ్డు చెప్పలేదు. అలాగే వేసుకుని ఏమైనా మిగిలితే మాకిచ్చేయండి చెప్పింది. ఎన్సీఎల్టీలో రుణదాత బ్యాంకులు పిటిషన్లు వేసి.. ఆ కంపెనీని వేలం వేయాలనుకున్నాయి. కానీ ఒక్కరంటే ఒక్కరు రాలేదు. చివరికి ఆ బ్యాంకులు విసుగెత్తిపోయి.. సుబ్బరామిరెడ్డి కుటుంబానికే ఆఫర్ ఇచ్చాయి. మత్తం కట్టాల్సిన రూ. 8100 కోట్లలో వన్ టైమ్ సెటిల్మెంట్ కింద రూ. 2400 కోట్లు కట్టి కంపెనీని మీరే ఉంచుకోండి అని ఆఫర్ ఇచ్చాయి. దీనికి ఆ కుటుంబం ఆనందంగా అంగీకరించింది. ఇప్పుడు రూ. 2400 కోట్లు కట్టి గాయత్రీ ప్రాజెక్స్ మళ్లీ కాంట్రాక్టుల పేరుతో వేల కోట్లు అప్పులు చేయడానికి అర్హత సాధిస్తుంది.
జల్సాకు పెట్టిందిపేరు అయిన సుబ్బరామిరెడ్డి కుటుంబం.. బ్యాంకుల వద్ద అప్పులు తీసుకున్న డబ్బులతో వ్యాపారం చేసి బాగానే వెనకేసుకుని ఉంటారు. ఆ డబ్బులు రూ. 2400 కోట్లు కట్టేసి మళ్లీ తన కంపెనీని తానే ఉంచుకుంటారు. అంటే.. ఐదు వేల కోట్లకుపైగా అప్పనంగా బ్యాంకులకు ఎగ్గొట్టేస్తున్నారు.