పిల్లలను అడ్డం పెట్టుకుని దోపిడీ చేసి.. అంతా బయటపడిన తర్వాత వాళ్లను నట్టేట ముంచి తాము బయటపడే దోపిడీ దొంగల వ్యూహాన్ని వైవీ సుబ్బారెడ్డి చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నానని అనుకుంటున్నారు. తన మాజీ పీఏ చిన్న అప్పన్నకు బోలేబాబా డెయిరీ వాళ్లు డబ్బులు ఇస్తే తనకేం సంబందం అని ఆయన అంటున్నారు. ఆయన తెలివి తేటల్ని సీబీఐ సిట్ అధికారులు అర్థం చేసుకోలేరని అనుకుంటున్నారేమోకానీ.. విచిత్రమైన వాదన వినిపిస్తున్నారు
చిన్న అప్పన్నను పీఏగా తీసేసిన తర్వాత ప్రభుత్వంలో పదవి ఇచ్చారు. అది కూడా ఏపీ భవన్ లో స్పెషలు లైజన్ ఆఫీసర్ గా నియమించారు. అక్కడ ఉండి ఆయన ఏం చేస్తారంటే.. కల్తీ నెయ్యి స్కానర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తారన్నమాట. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆయన ఉన్నారు. అంత కాలం లంచాలు వసూలు చేశారు. అవి సుబ్బారెడ్డికి చేరాయని సిట్ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.
అప్పన్న ఓ పీపీలికం. ఆయన సొంతంగా ఏమీచేయలేరు. ఆయనకు పలుకుబడి లేకుండా పదవి ఇవ్వరు. సంబంధం లేని టీటీటీలో పెత్తనం చేసే అవకాశం ఇవ్వరు. మొత్తంగా అప్పన్నను అడ్డం పెట్టుకుని వీరు దోపిడీలకు పాల్పడ్డారు. ఇప్పుడు దొరికిపోయేసరికి అప్పన్నను బలి చేసి తాము నీతిమంతులమని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.