1945లో మరణించి ఉంటే, 1966నాటి గ్రూప్ ఫోటోలో నేతాజీ ! ఎలా సాధ్యం ?

సంచలనం రేపుతున్న `ఫేస్ మ్యాపింగ్’ ఎవిడెన్స్

స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945లో విమానప్రమాదంలో మరణించారని అంటారు. అయితే ఈ సంఘటన జరిగిన 20ఏళ్లకు అప్పటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిగారు తాష్కంట్ లో ఇండో-పాక్ శాంతి చర్చలకు వెళ్ళినప్పుడు తీసిన ఒక గ్రూప్ ఫోటోలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కనిపించారు ! ఇది ఎలా సాధ్యం ? మరణించినట్లు ప్రకటించిన వ్యక్తి 20ఏళ్ల తర్వాత గ్రూప్ ఫోటోలో ఎలా కనిపిస్తారు!! ఫోటోలో ఉన్నది నేతాజీనేనా ? లేక అలాంటి పోలికలున్న మనిషా ?? అన్న సందేహం ఇప్పుడు దాదాపుగా తేలిపోయింది. నేతాజీ మరణంపై నిజానిజాలను వెలికితీసే ప్రయత్నంలో తిరుగులేని సాక్ష్యం ఒకటి లభించింది. దీని ప్రకారం, ఆ గ్రూప్ ఫోటోలో ఉన్నది మరెవరో కాదు, ఆయనే నేతాజీ సుబాష్ చంద్రబోస్. ఇలా నిర్దారించడానికి ఉపయోగపడిన సాంకేతిక పరిజ్ఞానం – `ఫోరెన్సిక్ ఫేస్ మ్యాపింగ్ ‘.

ఒక బ్రిటీష్ నిపుణుడు `ఫోరెన్సిక్ ఫేస్ మ్యాపింగ్’ పద్ధతి ద్వారా లాల్ బహదూర్ శాస్త్రి, మరికొందరు ప్రముఖులతోపాటుగా ఉన్నది నేతాజీనేనని తేల్చి చెప్పాడు. 62 పేజీల నివేదికను కూడా అందజేశాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఇన్ పుట్స్ ఆధారంగా ఇండియా టైమ్స్ వెబ్ సైట్ లో రిషబ్ బనెర్జీ డిసెంబర్ 12 (2015)న పోస్ట్ చేసిన వ్యాసంలో మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని…

1. నేతాజీ మరణంలోని మిస్టరీని చేధించేందుకు ఏర్పడిన పరిశోధకుల బృందం చేతికి మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రితో కూడిన ఒక గ్రూప్ ఫోటో చిక్కింది. చాలా ఆశ్చర్యకరంగా ఆ గ్రూప్ ఫోటోలో రెండవ వరసలో కుడివైపున వెనక నిలబడిన వ్యక్తి (ముఖం మాత్రమే కనబడేలా ఉన్న వ్యక్తి) అచ్చు గుద్దినట్లు నేతాజీలాగానే ఉన్నారు.

2. ఈ ఫోటో 1966లో లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ కు వెళ్ళినప్పుడు తీసింది.

3. పోరెన్సిక్ ఫేస్ మ్యాపింగ్ పద్ధతిలో బ్రిటన్ కు చెందిన నీల్ మిల్లెర్ సుప్రసిద్ధ నిపుణుడు. యుకెలో హైకోర్టుల్లోనూ, Hagueలోని అంతర్జాతీయ న్యాయస్థానంలోనూ కొన్ని కేసుల్లో నిపుణుడి అభిప్రాయాల కోసం ఈయన సేవలను ఉపయోగించుకుంటున్నారు.

4. నీల్ మిల్లెర్ గ్రూప్ ఫోటోని నెలరోజులపాటు క్షుణ్ణంగా పరిశోధించి, పరిశీలించి చివరకు సుబాష్ చంద్రబోస్ ఫోటో, ఈ గ్రూప్ ఫోటోలో కనబడతున్న వ్యక్తి ఒకేలా ఉన్నారని తన నివేదికలో స్పష్టం చేశారు. ఇద్దరు వేరువేరుకారనీ, ఒక్కరే అని తేల్చిచెప్పారు. 62 పేజీల నివేదికను క్రిందటి నెలలో (నవంబర్ 2015)లో అందజేశారు. అదిప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

5. గ్రూప్ ఫోటోలో ఉన్న వ్యక్తిని TM (తాష్కంట్ మ్యాన్) అనీ, నేతాజీ ఒరిజనల్ ఫోటోని SCB (సుబాష్ చంద్ర బోస్) అని పేర్కొంటూ నీల్ మిల్లెర్ తన నివేదికలో వివరాలు పొందుపరిచారు.

6. TM , SCB లను పోల్చి చూస్తే, ముఖ కవళికలు ఒకేలా ఉన్నాయి. చెవులు, కళ్లు, నుదురు, ముక్కు, పెదవులు, బుగ్గలు సరిగా పోలిఉన్నాయని ఫోరెన్సిక్ ఫేస్ మ్యాపింగ్ పరీక్షల్లో ఘనుడైన నీల్ మిల్లెర్ పేర్కొన్నారు. ఆరోజుల్లో ఫోటో నాణ్యత ప్రమాణాల ఆధారంగా జుట్టు కనిపించడంలో కొద్దిపాటి తేడాలుంటాయనీ, అలాగే కళ్లజోడు, వేసుకున్న బట్టలు కూడా ఫోటో తీసిన యాంగిల్ ను బట్టి కొద్దిపాటి తేడాగా ఉండవచ్చని ఆయన తన నివేదికలో అభిప్రాయపడ్డారు. అయితే మొత్తంగా చూస్తే, TM, SCB ఒకరయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నట్లు నీల్ మిల్లెర్ తన రిపోర్ట్ లో పేర్కొన్నారు.

7. ఫోటో మ్యాపింగ్ చేయించే పనిని సిద్ధార్థ సత్ భాయ్ తీసుకున్నారు. ఆయన భారతీయ సంతతికి చెందిన డచ్ దేశీయుడు. గతంలో ఈయన మిషన్ నేతాజీలో సభ్యునిగా కూడా ఉన్నారు. అంతేకాదు, 1969లో పారిస్ లో తీసిన గ్రూప్ ఫోటోలో గడ్డం పెంచుకుని ఉన్న ఒక జర్నలిస్ట్ లో బోస్ పోలికలున్నాయంటూ సంచలనం సృష్టించింది ఈయనే. 1969 జనవరి 25న అమెరికా, ఉత్తర వియత్నాం మధ్య శాంతి చర్చలు పారిస్ లో జరిగినప్పుడు విలేఖరులతో కూడిన గ్రూప్ ఫోటోలో ఎవ్వరూ గుర్తుపట్టలేని గడ్డం మనిషి (పారిస్ మ్యాన్) నేతాజీనే అంటూ ప్రచారం జరిగింది.

8. ఫోటో మ్యాపింగ్ పని మొదట్లో భారతీయ నిపుణిడిచేతనే చేయించాలనుకున్నారట. ఎవ్వరూ సమయానికి ముందుకురాకపోవడం, పైగా, వేరే దేశీయునిచేత నివేదిక తయారుచేయిస్తే, అది నిష్పక్షపాతంగా ఉంటుందన్న ఉద్దేశంతో నీల్ మిల్లెర్ కు 800 పౌండ్లు చెల్లించేలా పని అప్పగించారు.

9. లాల్ బహుదూర్ శాస్త్రిగారి బంధువు (మునిమనవడు) సంజయ్ నాథ్ సింగ్ చెబుతున్న మాటలు కూడా నేతాజీ 1966వరకు జీవించి ఉన్నారన్న వాదనను బలపరుస్తోంది. ` స్వదేశానికి తిరిగివచ్చిన తర్వాత, ప్రతిపక్షం వాళ్లు కూడా దాదాపుగా మరచిపోయిన ఒక సంగతి చెబుతాను’- అని లాల్ బహదూర్ శాస్త్రి ఆరోజు తాష్కంట్ నుంచి ఫోన్ లో చెప్పారట. కానీ, అదే రోజు సాయంత్రం లాల్ బహదూర్ శాస్త్రి అనుమానాస్పదంగా గుండెపోటుతో మరణించారని సమీప బంధువులు చెబుతున్నారు.

10. ఇప్పుడేం చేయాలి ? : నీల్ తయారుచేసిన నివేదికను నేతాజీపై పరిశోధనలు చేస్తున్న బృందం ప్రధాని నరేంద్ర మోదీకి అప్పగించడంద్వారా నేతాజీ మరణ మిస్టరీని చేధించాలనుకుంటున్నది. ప్రధాని మోదీ తన రష్యా పర్యటనలో భాగంగా ఈ నివేదికను రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ కు అందజేసి, నేతాజీ మరణ రహస్యం చేధించాలని ఒత్తిడి తీసుకురావాలని ఈ బృందం విజ్ఞప్తి చేస్తోంది. ప్రధాని మోదీ ఆమధ్య నేతాజీ కుటుంబసభ్యులను కలుసుకున్నప్పుడు తాను రష్యావెళ్ళినప్పుడు నేతాజీ ఫైళ్ల గురించి పుతిన్ తో మాట్లాడతానని చెప్పారు. మరి ఇప్పుడు ఫోటో మ్యాపింగ్ నివేదికతో, 1966 తాష్కంట్ సమావేశంలో నేతాజీ ఉన్నట్లు తేలిపోవడంతో వాస్తవమేమిటో తేల్చుకునే సమయం ఆసన్నమైందనే చెప్పాలి. ఈ నివేదిక నిజమని తేలితే, ఇప్పటివరకు వినిపిస్తున్న రెండు వాదనలు తప్పని తేలిపోతాయి. 1. నేతాజీ విమాన ప్రమాదంలో 1945లో మరణించలేదు. 2. Joseph Stalin 50 దశకం తొలినాళ్లలో నేతాజీని చంపించారన్న వాదన శుద్ద తప్పు.

మొత్తానికి తీగలాగితే డొంకంతా కదులుతోంది. నేతాజీ మరణం (అదృశ్యం) వ్యవహారం తేటతెల్లమైతే నిజమైన దోషులెవరో, వారి బండారమేమిటో తేలిపోతుంది. దేశరాజకీయ చరిత్రలో హీరోలుగా వెలుగొందుతున్నవారు విలన్లుగా మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే, ప్రధాని మోదీ ఏమేరకు పావులు కదుపుతారో వేచిచూడాలి. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం ఈ నివేదికపై పెదవి కదపడంలేదు. అసలు ఈ నివేదికలోని ప్రామాణికత ఎంతో ముందు తేలాల్సిఉంది. ఈలోగా తొందరపడటం మంచిదికాదని కేంద్రం భావిస్తోంది.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close