బింబిసార విజయ రహస్యం ఇదేనా?

కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్ కి రావడం తగ్గిపోయిందనే మాట సర్వాత్ర వినిపిస్తోంది. దీనికి కారణం ఓటీటీ ప్రభావమని కొందరంటే.. సినిమా టికెట్ రేట్లు ఇష్టం వచ్చినట్లు పెంచి మళ్ళీ తగ్గించి ప్రేక్షకుడికి సినిమా అంటే అసహ్యం కలిగేలా చేశారని ఇండస్ట్రీ పెద్దలే అభిప్రాయ ప‌డిన‌ పరిస్థితి నెలకొంది. ఏదేమైనా ప్రేక్షకులు థియేటర్లోకి రావడం తగ్గిందనే మాట మాత్రం నిజం. ఇలాంటి సమయంలో వచ్చిన సీతారామం, బింబిసార, కార్తికేయ 2 చిత్రాలు విజయవంతమైయ్యాయి. థియేటర్లో జనాలు కనిపిస్తున్నారు.

అయితే ఇందులో బింబిసారది మాత్రం ప్రత్యేక విజయం. కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఈ చిత్రానికి అత్య‌ధిక‌ ఓపెనింగ్స్ వచ్చాయి. బింబిసారని చూడ‌డానికి జనాలు ఆసక్తిని చూపిస్తున్నారు. సినిమా కొన్న బయ్యర్లు తొలి మూడు రోజుల్లోనే సేఫ్ జోన్ లోకి వెళ్లారు. సినిమా చూస్తున్న ప్రేక్షకులు కూడా హ్యాపీ. సినిమా తీసిన‌ నిర్మాతలు కూడా ఫుల్ హ్యాపీ. బింబిసార అందరికీ సంతోషాన్ని ఇచ్చింది. స్వయంగా నిర్మాత దిల్ రాజు.. ఏడాది వచ్చిన సినిమాల్లో బింబిసారదే అసలైన విజయం అన్నారు. ఇలా బింబిసార అసలైన విజయం నమోదు చేయడానికి చాలా కారణాలు వున్నాయి.

బింబిసారని ప‌ర‌మిత‌ బడ్జెట్ లో తెరకెక్కించారు. ప్రతి రూపాయి సినిమా కోసం ఖర్చుపెట్టారు. అనవసరమైన హంగుల జోలికి పోలేదు. కాఫీ కప్పుని అందించే పాత్ర కోసం కూడా సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని పెట్టే పైత్యం తెలుగు సినిమాల్లో కనిపిస్తుంటుంది. కానీ బింబిసారలో అలంటి వృధా ఖర్చులు చేయలేదు. కొత్త దర్శకుడు రెమ్యునిరేషన్ తీసుకోకుండానే సినిమా చేశాడు. సినిమా విజయం తర్వాత అతను కోరుకున్నది ఇస్తారు. అది వేరే సంగతి. కళ్యాణ్ రామ్ సొంత సినిమా. ఆయన కూడా రెమ్యునిరేషన్ ముట్టుకోలేదు. ఒక స్టార్ హీరో, హీరోయిన్ తీసుకునే రేమ్యునిరేషన్ తో బింబిసార పూర్త‌యిపోయింది.చారిత్ర‌క నేప‌థ్యం ఉన్న సినిమా కాబ‌ట్టి.. యుద్ధ స‌న్నివేశాల్ని గుప్పించొచ్చు. కానీ.. దాని జోలికి పోలేదు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ”యుద్ధ సన్నివేశాలు పెట్టొచ్చు. కానీ.. బాహుబ‌లి, ఆర్‌.ఆర్‌.ఆర్‌లో.. వార్‌సీన్స్ ముందు మేం ఏం చేయ‌గ‌లం. అంత బ‌డ్జెట్ లేదు. అందుకే.. అస‌లు వాటి గురించి ఆలోచించ‌లేదు.కావాల‌నే వార్ సీన్లు ప‌క్క‌న పెట్టాం” అని నిర్మొహ‌మాటంగా చెప్పేశాడు క‌ల్యాణ్ రామ్‌.

థియేటర్ కి జనాలు రావడం లేదనేది ఇండస్ట్రీ కంప్లయింట్. దీనికి ఓటీటీని కారణంగా చూపుతున్నారు. ఐతే ఇది సరైన కారణం కాదని నిరూపించింది బింబిసార. ప్రేక్షకుడు థియేటర్ కి రావాలంటే ఎలాంటి కంటెంట్ ఇవ్వాలో బింబిని చూసి నేర్చుకోవాల్సిందే. ట్రైలర్, టీజర్. పోస్టర్ ఇలా అన్నీ సినిమాని థియేటర్లో చూడాలనే ఆసక్తిని క్రియేట్ చేశాయి. సినిమాని చక్కగా ప్రమోట్ చేసుకున్నారు. ఓవర్ హైప్‌, ప్రమోషన్స్ జోలికి పోలేదు. సినిమా గురించి మరీ ఎక్కువ చేసి చెప్పలేదు. పెద్ద అంచనాలు లేకుండా చూసిన ప్రేక్షకుడికి థ్రిల్ ని ఇవ్వగలిగింది బింబి. సినిమాని బడ్జెట్ లో తీయగలిగితే ఆటోమేటిక్ గా లాభాలు వస్తాయనడానికి మంచి ఉదాహరణ బింబి. మూడు రోజుల్లోనే నిర్మాతలు, పంపిణీదారులు లాభాలబాట పట్టారు. కారణం.. సినిమాని తక్కువ రేట్లకే తీసుకున్నారు. టికెట్లు కూడా సాదరమైన ధరలకే ఇచ్చారు. అందుకే ఇటు ప్రేక్షకుడు, అటు పంపిణీదారులు, నిర్మాతలు అందరూ హ్యాపీ.

బింబితో టాలీవుడ్ కి ఒక విషయం అర్ధం చేసుకోవాలి. ప్రేక్షకుడికి మంచి కంటెంట్ కావాలి. ప్రేక్షకుడు థియేటర్ రావాలనే ఆసక్తిని క్రియేట్ చేయాలి. నిర్మాతగా నువ్వు హీరోకి ఎంత రెమ్యునిరేషన్ ఇస్తున్నావనే సంగతి ప్రేక్షకుడికి అనవసరం. (ఎఫ్ 3కి వందకోట్లు వచ్చాయని ప్రమోషన్స్ లో చెప్పుకున్న దిల్ రాజు.. బింబిసారదే అసలు విజయం అని అభిప్రాయపడటానికి కారణం ఇదే). చేసిన ఖర్చు తెరపై కనిపించాలి. అప్పుడే ప్రేక్షకుడు సినిమా కోసం ఖర్చు చేస్తాడు. బింబిసార విజయ రహస్యం ఇదే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

5 నెలల్లో రూ. 40వేల కోట్లు గల్లంతయ్యాయట !

ఏపీ బడ్జెట్ నిర్వహణ గురించి ప్రత్యేకంగా సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన పని లేదు. బడ్జెట్ వ్యవహారం ఇప్పుడు కూడా నడుస్తోంది. ఈ ఐదు నెలల్లో రూ. నలభైవేల కోట్లకుపైగా లెక్కలు తెలియడం లేదని గగ్గోలు...

‘గాడ్ ఫాద‌ర్‌’ హిట్‌… నాగ్ హ్యాపీ!

ఈ ద‌స‌రాకి మూడు సినిమాలొచ్చాయి. గాడ్‌ఫాద‌ర్‌, ది ఘోస్ట్‌, స్వాతిముత్యం. గాడ్ ఫాద‌ర్‌కి వ‌సూళ్లు బాగున్నాయి. స్వాతి ముత్యంకి రివ్యూలు బాగా వ‌చ్చాయి. ది ఘోస్ట్ కి ఇవి రెండూ లేవు....

వైసీపీ సర్పంచ్‌ల బాధ జగన్‌కూ పట్టడం లేదు !

వారు వైసీపీ తరపున సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి పార్టీనో.. సొంత పార్టీలో ప్రత్యర్థుల్నో దెబ్బకొట్టడానికి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకున్నారు. గెలిచారు. కానీ ఇప్పుడు వారికి అసలు సినిమా కనిపిస్తోంది. వీధిలైట్...

చిరంజీవి ఫ్యాన్స్ Vs బ్రాహ్మణ సంఘాలు..

చిరంజీవి ఫ్యాన్స్ Vs బ్రాహ్మణ సంఘాలు.. ఇప్పుడు బంతి... వాళ్లిద్ద‌రి చేతికీ చిక్కింది. ఇక ఆడుకోవ‌డ‌మే త‌రువాయి. అవును... అల‌య్ బ‌ల‌య్‌... కార్య‌క్ర‌మంలో చిరంజీవి - గ‌రిక‌పాటి మ‌ధ్య ఏం జ‌రిగిందో తెలిసింది. చిరుని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close