మీడియా వాచ్‌ : AP 24X7 చానల్ కి కొత్త సీఈవో

ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో విజయవాడ కేంద్రంగా AP 24X7 అనే చానల్ ప్రారంభమయింది. మా టీవీ మాజీ అధినేత మురళీకృష్ణంరాజు ఈ చానల్‌కు చైర్మన్. మరికొంత మంది పెట్టుబడిదారులతో కలిసి ప్రారంభమైన ఈ చానల్ మొదట్లో బాగానే నడిచింది. అయితే అక్కడ పని చేస్తున్న ఉద్యోగుల మధ్య ఆధిపత్య పోరు తెరపైకి వచ్చింది. సీనియర్ జర్నలిస్ట్ లు వెంకటకృష్ణ , సాయి ఛానల్ ని చూసేవారు. కొద్దిరోజులకే ఆధిపత్య పోరుతో సాయి బయటికి వెళ్లిపోయారు. తర్వాత సీఈవోగా వెంకటకృష్ణ కొన్నాళ్లు కొనసాగారు. అయితే వెంకటకృష్ణ తెలుగుదేశం స్టాండ్ తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఆయన పెట్టె చర్చలు చాలా వరకు తెలుగుదేశాన్ని సమర్ధిస్తున్నట్లు ఉండేవని విమర్శలు వచ్చాయి. ఒక దశలో ఆయన చంద్రబాబు ప్యాకేజీ తీసుకొని చర్చలు పెడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నడుమ ఆయన సీఈవో పోస్ట్ కి రిజైన్ చేసి బయటికి వచ్చి ఏబీఎన్ లో చేరిపోయారు.

ఈ పరిణామాల మధ్య కొన్నాళ్ళు ఇన్ యాక్టివ్ అయిపోయిన AP 24X7 ఛానల్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా సిద్దమౌతుంది. AP 24X7 చానల్ కొత్త సీఈవో గా సుధాకర్ అడపా బాధ్యతలు తీసుకున్నారు. పలు సాఫ్ట్వేర్ కంపెనీలకు సీఈవోగా పని చేసిన అనుభవం వున్న సుధాకర్ కి అధికార పార్టీ వైసీపీతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది . ఇప్పుడు ఆయన్ని AP 24X7 ఛానల్ కి సీఈవో చేయడంతో మళ్ళీ ఛానల్ కి కొత్త ఊపిరి వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చైర్మన్ గా మురళీకృష్ణంరాజే వున్నారు. అయితే కొత్త సీఈవో ఆద్వర్యంలో ఛానల్ ని గ్రౌండ్ లెవల్ నుండి సమూల మార్పులు చేపట్టే దిశగా అడుగులు వేస్తోన్నట్లు తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేగేదాకా లాగుతున్న సర్కార్-ఎస్‌ఈసీ..!

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగసంక్షోభ సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల నిర్వహణకు హైకోర్టు కూడా స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం.. అధికారులు సహకరించడానికి ఏ మాత్రం సిద్ధంగా లేరు. అదే సమయంలో ఎస్‌ఈసీ...

గ్రేటర్ పీఠం కైవసానికి టీఆర్ఎస్ స్కెచ్ రెడీ ..!

గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవిని అలా వదిలేయడానికి తెలంగాణ రాష్ట్ర సమితి పెద్దలకు మనస్కరించలేదు. ఎలాగోలా పీఠంపై గులాబీ నేతను కూర్చోబెట్టాల్సిందేనని డిసైడయ్యారు. ఎన్నికలు ముగిసి చాలా కాలం అవుతున్నా.. పాత కార్యవర్గానికి...

ధిక్కరణకే సర్కారు మొగ్గు..!

పంచాయతీ ఎన్నికల విషయంలో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ.. ఎస్‌ఈసీకి సహకరించకూడదని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు అధికారులకు తేల్చి చెప్పడంతో వారెవరూ.. ఎస్‌ఈసీతో కనీసం సమావేశానికి కూడా ఆసక్తి చూపడంలేదు. పంచాయతీ...

వెంటిలేటర్‌పై శశికళ..!

ఇరవై ఏడో తేదీన చిన్నమ్మ విడుదలవుతుంది.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దున్ని పారేస్తుందని... తమిళ మీడియా జోరుగా విశ్లేషిస్తున్న సమయంలో అనూహ్యంగా శశికళ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆమెకు శ్వాస సమస్య...

HOT NEWS

[X] Close
[X] Close