సుధీర్ బాబు స‌త్తాకి ప‌రీక్ష‌

కృష్ణ కుటుంబం నుంచి వ‌చ్చిన హీరో… సుధీర్‌బాబు. త్వ‌ర‌గానే త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ని చాటుకున్నాడు. ప్రేమ‌క‌థ‌లూ, యాక్ష‌న్ సినిమాలూ, కాన్సెప్ట్ క‌థ‌లూ.. ఇలా అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలూ చేశాడు. నిర్మాత అయ్యాడు. `శ‌మంత‌క‌మ‌ణి`లాంటి మ‌ల్టీస్టార‌ర్ల‌కూ ఓకే చెప్పాడు. ఇప్పుడు త‌న దృష్టంతా `వి` సినిమాపై ఉంది. నానితో పాటు సుధీర్ న‌టించిన సినిమా ఇది. సెప్టెంబ‌రు 5న అమేజాన్ లో విడుద‌ల కానుంది.

నాని సినిమా అంటే.. అంద‌రి దృష్టీ త‌న‌పైనే ఉంటుంది. తెర‌పై ఎంత‌మంది ఉన్నా అంద‌రినీ డామినేట్ చేసేస్తాడు నాని. అలాంటి చోట‌… త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త నిలుపుకోవ‌డం ఏ హీరోకైనా క‌ష్ట‌మే. కానీ `వి` ట్రైల‌ర్ చూస్తుంటే… సుధీర్ బాబు మాత్రం నానికి ధీటుగా స‌మాధానం ఇచ్చాడ‌నిపిస్తోంది. నాని సైకోగా న‌టించిన సినిమా ఇది. సాధార‌ణంగా ఇలాంటి పాత్ర‌ల్లో న‌టీన‌టులు విశ్వ‌రూపం చూపిస్తారు. నానీ కూడా అదే చేశాడు. కాక‌పోతే.. పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో సుధీర్ న‌ట‌న కూడా అబ్బుర‌పరిచేలా ఉంటుంద‌ని ఇన్‌సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా త‌న 8 ప్యాక్ బాడీతో సుధీర్ యాక్ష‌న్ ప్రియుల్ని అల‌రించ‌డానికి రెడీ అవుతున్నాడ‌ట‌. ట్రైల‌ర్ లోని కొన్ని షాట్స్ లో సుధీర్ 8 ప్యాక్ క‌నిపించింది. మెహ‌రం నేప‌థ్యంలో సాగే యాక్ష‌న్ సీన్‌లో సుధీర్ బాబు ఫీట్స్ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తాయ‌ని తెలుస్తోంది. ఈ సినిమాతో సుధీర్‌కి కొత్త ఇమేజ్ రావ‌డం ఖాయ‌మ‌న్న‌ది సుధీర్ బాబు స‌న్నిహితుల మాట‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“గ్రేటర్‌”లో ఇప్పుడు పీవీ, ఎన్టీఆర్ ఘాట్ల కూల్చివేత రాజకీయం..!

గ్రేటర్ హైదరాబాద్ ప్రచారం సర్జికల్ స్ట్రైక్స్ నుంచి కూల్చివేతల వరకూ వచ్చింది. ఒకరు పీవీ, ఎన్టీఆర్ ఘాట్‌ల గురించి మాట్లాడగా.. మరొకరు దారుస్సలాం కూల్చివేత గురించి మాట్లాడుకోవడంతో రగడ మలుపు తిరిగింది....

“గ్యాగ్” ఆర్డర్స్‌పై సుప్రీం స్టే..!

ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి కేసులో ఎఫ్ఐఆర్‌లో విషయాలను మీడియాలో.. సోషల్ మీడియాలో ప్రచారం చేయకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అంటే.. ఆ...

ఆ సినిమాలో ర‌కుల్ లేదు

మోహ‌న్‌బాబు క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న చిత్రం.. సన్నాఫ్ ఇండియా. డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌కుడు. ఇళ‌య‌రాజా సంగీత అందిస్తున్నారు. ఎం.ధ‌ర్మ‌రాజు ఎం.ఏ, పుణ్య‌భూమి నాదేశం త‌ర‌హాలో సాగే క్యారెక్ట‌రైజేష‌న్ ఈ సినిమాలో క‌నిపించ‌బోతోంద‌ట‌. మ‌ళ్లీ ఆ...

రివ్యూ: అంధ‌కారం

హార‌ర్‌, థ్రిల్ల‌ర్ సినిమాల్ని చూసి.. విసుగొచ్చేసింది. అన్నీ ఒక ఫార్మెట్‌లోనే సాగుతుంటాయి. హార‌ర్ అన‌గానే... భ‌యంక‌రమైన రీ సౌండ్లు, ఓ ఇల్లు, అందులో కొన్ని పాత్ర‌లు విచిత్రంగా ప్ర‌వ‌ర్తించ‌డం.. ఇవే క‌నిపిస్తాయి. థ్రిల్ల‌ర్లూ...

HOT NEWS

[X] Close
[X] Close