ఆ సినిమా ని సుధీర్ వర్మ వదిలేశాడా?

కొరియన్ సినిమా కి రీమేక్ గా విజయం అనుకుంది ఓ బేబీ. డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు ఈ ముగ్గురు కలసి మరో కొరియన్ రీమేక్ ని చేశారు. అదే ‘శాకిని డాకిని’. సౌత్ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం ‘మిడ్‌నైట్ రన్నర్స్’ కు అధికారిక రీమేక్ ఇది. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రలు పోషించారు. సుధీర్ వర్మ దర్శకుడు. సినిమా విడుదలకు రెడీ అయ్యింది. ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు. అయితే ఈ ప్రమోషన్స్ లో దర్శకుడు సుదీర్ వర్మ ఎక్కడా కనిపించడం లేదు. కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయడం లేదు.

దీనికి వెనుక ఒక బలమైన కారణం వుంది. సినిమా నిర్మాతల్లో ఒకరైన సునీత తాటి ఫిల్మ్ మేకింగ్ లో ఎక్కువగా ఇన్వాల్ అయ్యారని ఇన్ సైడ్ టాక్. కొరియన్ స్క్రిప్ట్ ని యధాతధంగా తీయాలని పట్టుబట్టారు సునీత. సుదీర్ వర్మ కొన్ని మార్పులు సూచించాడు. కానీ వినలేదు. కొరియన్ స్క్రిప్ట్ ప్రకారమే మొత్తం షూట్ చేసేశాడు. అయితే అవుట్ పుట్ తేడా కొట్టింది. దీంతో కొన్ని మార్పులు సూచించారట సునీత. ఈ మార్పులు చేయడానికి సుధీర్ వర్మ అంగీకరించలేదు. ఇక్కడే ఈగో సమస్యలు వచ్చాయి. సునీత మరో దర్శకుడిని పెట్టి రీ షూట్ చేశారు. ఈలోగా సుధీర్ వర్మ రవితేజ రావణాసుర సినిమాతో బిజీ అయిపోయారు. ‘శాకిని డాకిని’కి తన అంగీకారం లేకుండా మరో దర్శకుడితో షూట్ చేయడం సుధీర్ వర్మని భాదించింది. దీంతో సినిమా లైట్ తీసుకున్నాడు. ప్రీరిలీజ్ ఈవెంట్ కి కూడా సుధీర్ రావడం అనుమానమేనని వినిపిస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కుదరదన్న తెలంగాణ హైకోర్టు

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ఫ్యామిలీకి గుడ్ న్యూస్ లు వరుసగా వినిపిస్తున్నాయి. అప్రూవర్ గా మారిన దస్తగిరి తనను జైల్లో పెట్టి.. పెద్ద ఎత్తున ప్రలోభపెట్టడమే కాకుండా......

‘ఆ ఒక్కటీ అడక్కు’ రివ్యూ: క్లాసిక్ టైటిల్ చెడ‌గొట్టారు

Aa Okkati Adakku Movie review తెలుగు360 రేటింగ్ 2.25/5 -అన్వ‌ర్‌ ఒకప్పుడు అల్లరి నరేష్ నుంచి కామెడీ సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ వుండేది. తర్వాత పరిస్థితి మారింది. ఆయనపై కామెడీ కథలు సరిగ్గా...

బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు..!!

సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ ఫిర్యాదు ఆధారంగా ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్ల...

ఏపీ ఉద్యోగుల చైతన్యం – 4 లక్షలకుపైగా పోస్టల్ బ్యాలెట్స్ !

ఏపీలో పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సారి ఉద్యోగుల్లో మరింత ఎక్కువగా చైతన్యం కనిపిస్తోంది. ఎన్నికల విధులు... ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండేవారు పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకోవచ్చు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close