కోవిడ్ దెబ్బకు క్లీన్ బౌల్డ్ అవుతున్న యూరప్..!

అభివృద్ధి చెందిన దేశాల సమూహం అయిన యూరప్… ఇప్పుడు కోవిడ్ వైరస్ దెబ్బకు విలవిల్లాడుతోంది. స్పెయిన్లో రోజూ వందల మంది చనిపోతున్నారు. అక్కడ కోవిడ్ కారణంగా ఆరు వేల మంది చనిపోయారు. రోజుకు సగటున 750 మరణాలు నమోదవుతున్నాయి. స్పెయిన్ రాకుమారి మరయా థెరెసా.. కరోనా వైరస్‌తో చనిపోయారు. ఆమె వయసు 86 సంవత్సరాలు ప్రజలకు చేరువగా ఉండే యువరాణిగా ఆమెకు మంచి పేరుంది. ఇప్పటికే క్వీన్ లెజీటియా క్వారంటైన్లో ఉన్నారు. ఉగ్రవాదంపై పోరుకు నియమితులైన స్పెయిన్ పోలీస్ ఫోర్స్ కీలక అధికారి జీసుస్ గయోసో రే.. కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు.

స్పెయిన్ ప్రభుత్వం ఇప్పుడు ఆర్మీకి అత్యవసర అధికారాలు కట్టబెట్టింది. రోడ్లపై ఎవరూ తిరగకుండా లాక్ డౌన్ అమలు చేసే బాధ్యతను ఆర్మీకి అప్పగించారు. మృతదేహాలను మార్చురీల నుంచి ఇళ్లకు, అక్కడ నుంచి శ్మశాన వాటికలకు తరలించే సిబ్బంది కొరత ఉందని వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. శవాల తరలింపు, వాటిని భద్ర పరచడం, ఫ్యూనరల్ సర్వీస్ నిర్వహించడం లాంటి బాధ్యతలు కూడా ఇప్పుడు స్పెయిన్ ఆర్మీకి అప్పగించారు. బ్రిటన్‌లో పరిస్థితి ఎలా ఉందో.. క్విన్ ఎలిజబెత్, ప్రిన్స్ చార్లెస్‌లతో పాటు.. ప్రధాని బోరిస్ జాన్సన్‌లకు వచ్చిన పాజిటివ్ రిజల్టే చెబుతోంది. అక్కడ అత్యంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయి. మొత్తం లాక్ డౌన్ చేసేసినా.. కేసులు మాత్రం ఆగడం లేదు. అక్కడ మరణాలు అంతకంతూ పెరుగుతున్నాయి.

ఇటలీలో ఇప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదు. వందల సంఖ్యలో రోజూ మరణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. యూరప్ దేశాల్లోని చిన్న పట్టణాలకు కూడా కరోనా వైరస్ వ్యాపించడంతో వారికి ఏం చేయాలో తెలియని పరి్సథితి ఏర్పడింది. ఎంత మందికి త్వరలో వైరస్ సోకుతుందో చెప్పలేని పరిస్థితి అందుకే లాక్ డౌన్‌ ను సీరియస్‌గా తీసుకోవాలని ప్రజలకు ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఆర్థికంగా బలమైన దేశాలుగా ఉన్న యూరప్ సమూహం..ఇప్పుడు చితికిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ వైరస్ ప్రభావంతో.. వారు ఆర్థిక నష్టాన్నే కాదు.. అత్యధికంగా ప్రాణనష్టాన్ని చవి చూస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close