కేంద్రానికేం సంబంధం..? విజయసాయిపై భగ్గుమన్న బీజేపీ..!

ఏపీలో తీసుకునే నిర్ణయాలన్నీ… ప్రధానికి, హోంమంత్రికి చెప్పే చేస్తున్నామని విజయసాయిరెడ్డి.. నేరుగా మీడియాకు చెప్పడంతో బీజేపీలో కలకలం రేగింది. ఏపీ సర్కార్ నిర్ణయాలన్నీ అత్యంత వివాదాస్పదంగా ఉండటం.. ప్రజల దృష్టిలో… కక్ష సాధింపు చర్యలు గా ముద్రపడిపోవడంతో.. బీజేపీ అలర్ట్ అయింది. తమ ప్రమేయం ఏమీ లేదని… చెప్పడానికి వెంటనే.. బీజేపీ తరపున సుజనా చౌదరిని రంగంలోకి దింపారు. సుజనా చౌదరి.. వైసీపీపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు. విజయసాయిరెడ్డి ఏ ప్రాతిపదిన అలా ప్రకటన చేశారని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి తన స్టేట్‌మెంట్లతో తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఏ ప్రాతిపదికన ప్రధాని, హోంమంత్రితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నారని …ప్రశ్నించారు. నిజంగా అలానే చేస్తే.. పోలవరం కాంట్రాక్ట్‌ విషయంలో కేంద్రం సూచనను ఎందుకు పట్టించుకోలేదన్నారు. పీపీఏ రద్దు విషయంలో కేంద్రం సూచనను ఎందుకు పట్టించుకోలేదో చెప్పాలన్నారు. తాను జలశక్తి మంత్రితో ఇతర మంత్రులతో మాట్లాడానని…వారెవరూ తమకేమీ తెలియదంటున్నారని ప్రకటించారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్రం రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటుందని సుజనా స్పష్టం చేశారు.

ఏపీలో వైసీపీ సర్కార్ పై సుజనా చౌదరి ఓ రేంజ్ లో ఫైరయ్యారు. ముఖ్యంగా రాజధాని విషయంలో.. వైసీపీ నేతల ప్రకటనలపై మండిపడ్డారు. రాజధాని విషయంలో ప్రజలను ఇంత గందరగోళపర్చకూడదని… జనాన్ని గందరగోళపరిచే విషయాల్లోకి కేంద్రాన్ని లాగకూడదని హెచ్చరించారు. వైసీపీలో బొత్స, అవంతి, సాయిరెడ్డి తలో రకంగా మాట్లాడారని.. వరదలు వచ్చినంత మాత్రాన రాజధానిని మారుస్తారా అని సుజనాచౌదరి ప్రశ్నించారు. అమరావతిలో ప్రభుత్వ భవనాలు, క్వార్టర్స్‌ సిద్ధమయ్యాయి.. ఇప్పుడు రాజధాని మారుస్తారని తాను అనుకోవడం లేదన్నారు.

ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. ఇష్టానుసారం వ్యవహరిస్తే కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతామని… ఏపీ ప్రయోజనాలు బీజేపీకి ముఖ్యమని ప్రకటించారు. వరదల విషయంలో కేంద్ర జల సంఘం ముందుగానే హెచ్చరించినా… వరదల్లో ముంచాలన్న కుట్ర, కుతంత్రాల వల్ల ప్రజలు నష్టపోయారన్నారు. రైతులకు అపారంగా పంటనష్టం జరిగింది.. దీనికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. జగన్‌ అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయింది..ఏమీ తెలియని గందరగోళం ఉందన్నారు. విజయసాయిరెడ్డి ప్రకటన.. వెంటనే… సుజనా చౌదరి ఖండన… బీజేపీ.. వైసీపీ మధ్య ఉన్న కనిపించని స్నేహానికి గండికొట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close