‘ఛ‌త్ర‌ప‌తి’ రీమేక్‌కి నో చెప్పిన ద‌ర్శ‌కుడు

సాహో త‌ర‌వాత‌.. సుజిత్ ఖాళీగానే ఉన్నాడు. లూసీఫ‌ర్ రీమేక్ చేసే అవ‌కాశం వ‌చ్చిన‌ట్టే వచ్చి చేజారిపోయింది. ఇప్పుడు మ‌రో రీమేక్ త‌న‌ని వెదుక్కుంటూ వెళ్లింది. అయితే దానికి తన‌కు తాను `నో` చెప్పేశాడు.

ప్ర‌భాస్ – రాజ‌మౌళిల ఛ‌త్ర‌ప‌తి సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరో. ఈసినిమాకి ఓ సౌత్ ఇండియ‌న్ ద‌ర్శ‌కుడినే తీసుకోవాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. ఈ లిస్టులో ముందుగా చ‌ర్చించిన పేరు… సుజిత్. తాను తీసిన సాహో ద‌క్షిణాదిన పెద్ద‌గా ఆడ‌క‌పోయినా… నార్త్ లో మంచి వ‌సూళ్లు అందుకుంది. అందుకే సుజిత్ ని సంప్ర‌దించారు. అయితే సుజిత్ ఈ సినిమా రీమేక్ చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని తెలుస్తోంది. పైగా యూవీ క్రియేష‌న్స్‌లో సుజిత్ మ‌రో సినిమా చేయ‌డానికి ఒప్పందం చేసుకున్నాడు. సాహో త‌ర‌వాత‌.. యూవీతోనే సినిమా చేయాల‌న్న‌ది ఎగ్రిమెంట్‌. ఓ క‌థ రెడీ చేసి, హీరోని వెదికి ప‌ట్టుకునే ప‌నిలో ఉన్నాడు. అన్నీ కుదిరితే.. జ‌న‌వ‌రి నుంచి ఈ సినిమా మొద‌లు కావొచ్చు. `ఛ‌త్ర‌ప‌తి` రీమేక్ కూడా జ‌న‌వ‌రిలోనే ప‌ట్టాలెక్కాలి. అందుకే… సుజిత్ ఈ సినిమాని వ‌దులుకోవాల్సివ‌చ్చింద‌ని టాక్‌. సుజిత్ చేయ‌ని ప‌క్షంలో ప్ర‌భుదేవా, వినాయ‌క్ ల‌ని సంప్ర‌దించాల‌ని నిర్మాత‌లు భావించారు. ఇప్పుడు అదే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యార‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మహానాడు : టీడీపీ 6 హామీలతో భవిష్యత్‌కు గ్యారంటీ !

మహానాడులో తెలుగుదేశం పార్టీ ప్రజలకు సంక్షే్మ రంగంలో ఆరు హామీలు ప్రకటించింది. భవిష్యత్ కు గ్యారంటీ పేరుతో మినీ మేనిఫెస్టోని చంద్రబాబు ప్రకటించారు. నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు టీడీపీ...

ఎన్టీఆర్‌ను వైసీపీ స్మరించుకుంది.. చంద్రబాబును తిట్టడానికైనా సరే!

ఎన్టీఆర్ అందరి మనిషి. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సహజంగానేకొంత మందికి దూరంఅవుతారు. అలా దూరమైన వారు కూడా ప్రత్యేక సందర్భాల్లో దగ్గర చేసుకోక తప్పదు. ఎన్టీఆర్‌ను అలా దగ్గర చేసుకోవాల్సిన ప...

బాలయ్య కోసం కొత్త ప్ర‌పంచం సృష్టిస్తాడ‌ట‌

అ, క‌ల్కి, జాంబిరెడ్డి చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఇప్పుడు హను-మాన్ రూపొందిస్తున్నాడు. తేజా స‌జ్జా క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల కాబోతోంది. ఈలోగా నంద‌మూరి బాల‌కృష్ణ‌తో సినిమా చేసే...

అందరికీ బెంచ్ మార్క్ బిల్డింగ్‌లు – ఏపీ జనానికి మాత్రం బటన్లు !

తెలంగాణ ప్రభుత్వం ఓ పెద్ద సెక్రటేరియట్ కట్టుకుంది. కథలు కథలుగా చెప్పుకున్నారు. ఇప్పుడు కేంద్రం పార్లమెంట్ నిర్మించింది.. అంత కంటే ఎక్కువ కథలు చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ రెండు నిర్మాణాలూ అవసరం లేదని..దుబారా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close