ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇవ్వడంలో సుకుమార్ రూటే వేరు. పుష్ప లాంటి పాన్ ఇండియా హిట్ తీసి ”నేను చేసింది ఏమీ లేదు.. మొత్తం నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చూసుకుంది’అని ప్రకటించగలిగే మనసున్న డైరెక్టర్ తను. పుష్ప 2 విషయంలో కూడా ఎవరి క్రెడిట్ వారికి ఇచ్చేశారు. అయితే, సూసేకి పాటకు కొరియోగ్రాఫర్ గా చేసిన శ్రష్టి వర్మకి మాత్రం అంతగా క్రెడిట్ రాలేదు. మేకింగ్ వీడియోలో ఆమె కనిపించింది కానీ ఆమె గురించి ఎవరూ ప్రస్థావించలేదు. ఆ అవకాశం రాలేదు.
అయితే ఎట్టకేలకు సుకుమార్ ఆమెకు ఇవ్వాల్సిన క్రెడిట్ ఇచ్చేశాడు. సీతా పయనం టీజర్ లాంచ్ ఈవెంట్లో అతిథిగా హాజరైన సుకుమార్, అక్కడే ఉన్న శ్రష్టి వర్మను ప్రశంసించారు. “సూసేకి పాటలో 80 శాతం శ్రష్టి వర్మ కంపోజ్ చేసింది. కొన్ని మాంటేజ్లను కూడా ఆమె కంపోజ్ చేసింది. ఈ క్రెడిట్ ఆమెకు దక్కాలి”అని కితాబిచ్చారు.
శ్రష్టి వర్మ వివాదం గురించి అందరికీ తెలిసిందే. కేసులో తీవ్రత, వయసు రిత్యా ఆమె పేరు పత్రికల్లో ఎక్కడా ప్రస్థావించనప్పటికీ నేషనల్ వైడ్ ఆ వివాదం హాట్ టాపిక్ గా మారింది. కొన్నాళ్ళు మీడియాకి కనిపించని శ్రష్టి తర్వాత కొన్ని పాడ్ కాస్ట్ లలో తనకు జరిగిన దాని గురించి పేర్లు ప్రస్థావించకుండానే వివరంగా చెప్పింది. కేసు ఇప్పటికీ కోర్ట్ లో వుంది. అయితే తనకు వర్క్ కావాలని ఇండస్ట్రీని కోరుతోంది శ్రష్టి. ఇప్పుడు సుకుమార్ క్రెడిట్ ఇవ్వడం ఆమె కెరీర్ కు కొత్త జోరు తెస్తుందేమో చూడాలి.