శివ నాగులు పాట మార్చ‌డంపై సుక్కు కామెంట్‌

రంగ‌స్థ‌లంలో ‘ఆ గ‌ట్టునుంటావా.. నాగ‌న్న‌.. ఈ గ‌ట్టుకొస్తావా’ అనే పాట ఉంది. ఈ పాట‌ని శివ‌నాగులు అనే జాన‌ప‌ద గాయ‌కుడితో పాడించారు. తెర‌పై సినిమా చూస్తే.. దేవి గొంతులో పాట వినిపించింది. శివ‌నాగులు పాడిన పాట బాగున్నా.. దాన్ని ప‌క్క‌న పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. శివ‌నాగులుకి అన్యాయం జ‌రిగిందంటూ.. సోష‌ల్ మీడియాలో శివ‌నాగులుపై సానుభూతి చూపిస్తున్నారు. ఈ విష‌యంపై సుకుమార్ స్పందించారు. ”శివ‌నాగులు పాడిన పాట బాగుంది. ఆ విష‌యంలో సందేహం లేదు.కానీ ఎందుకో గొంతు చ‌ర‌ణ్ గొంతుకి సూట‌వ్వ‌లేదు అనిపించింది. అందుకే దేవి వెర్ష‌న్ ఉంచేశాం” అని క్లారిటీ ఇచ్చాడు. నిజానికి ఈ పాట‌ని ముందు పాడింది దేవీనే. పాట షూట్ చేస్తున్న‌ప్పుడు కూడా.. దేవి వెర్ష‌నే ఉంది. ఆ త‌ర‌వాతే… శివ‌నాగులుతో పాట పాడించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com