సుకుమార్ జీవితాన్ని మార్చిన రాజ‌శేఖ‌ర్‌

సుకుమార్ …రాజ‌శేఖ‌ర్‌… వీరిద్ద‌రికీ అస్స‌లు సంబంధ‌మే లేదు. క‌ల‌సి ఒక్క‌సారి కూడా ప‌నిచేయ‌లేదు. క‌నీసం ఒక్క వేదిక కూడా పంచుకోలేదు. అయినా. స‌రే… `నా జీవితాన్ని మార్చిన హీరో రాజ‌శేఖ‌ర్‌` అని సుకుమార్ స‌గ‌ర్వంగా ప్ర‌క‌టించేశాడు. `శేఖ‌ర్‌` ప్రీ రిలీజ్ వేడుక‌లో. రాజ‌శేఖ‌ర్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం శేఖ‌ర్‌. ఈనెల 20న వ‌స్తోంది. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో శేఖ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి సుకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా త‌న జీవితాన్ని రాజ‌శేఖ‌ర్ ఎలా మార్చారో వివ‌రంగా చెప్పుకొచ్చారు.

చిన్న‌ప్పుడు సుకుమార్ ఊర్లో.. ఓ స్నేహితుడు ఉండేవాడ‌ట‌. త‌ను అంద‌రి గొంతుల్నీ మిమిక్రీ చేస్తూ… సెంట్రాఫ్ అట్రాక్ష‌న్ గా ఉండేవాడ‌ట‌. త‌న‌ని చూసి సుకుమార్ ఎప్పుడూ జెల‌సీ ఫీల‌వుతూ ఉండేవాడ‌ట‌. ఓరోజు.. అంద‌రి ద‌ష్టిలో ప‌డేందుకు.. సుకుమార్ రాజ‌శేఖ‌ర్ గొంతునీ, స్టైల్‌నీ ఇమిటేట్ చేసి చూపించాడ‌ట‌. దాంతో అంద‌రూ సుకుమార్ ని మెచ్చుకొన్నార్ట‌. అలా.. అంద‌రి దృష్టిలో ప‌డ్డాన‌ని చెప్పుకొచ్చాడు సుకుమార్‌. తాను కూడా సినిమాల్లోకి రాగ‌ల‌న‌ని, సినిమాలకు ప‌నికొస్తాన‌న్న న‌మ్మ‌కం… ఆ రోజే వ‌చ్చింద‌ని, అందుకే స‌భాముఖంగా రాజ‌శేఖ‌ర్‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పేశాడు సుకుమార్‌. ”నిజంగా నా జీవితాన్ని మార్చిన వ్య‌క్తి రాజ‌శేఖ‌ర్‌. ఆరోజు ఆయ‌న్ని ఇమిటేట్ చేయ‌క‌పోతే. నాలో కాన్ఫిడెన్స్ వ‌చ్చేది కాదు. ఈ విష‌యం ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ వేదిక‌పైనా పంచుకోలేదు. ఎప్పుడూ ఆ అవ‌కాశం రాలేదు. ఇప్పుడొచ్చింది కాబ‌ట్టి చెబుతున్నా” అంటూ త‌న బాల్య జ్ఞాప‌కాల్ని పంచుకున్నాడు సుకుమార్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close