అద్దంలో దెయ్యం – సందీప్ కొత్త‌గా ట్రైచేశాడుగా!

చెట్టుమీద దెయ్యం – నాకేం భ‌య్యం.. అంటూ చిన్న‌ప్పుడు త‌మాషాగా ఆట‌లాడుకునేవాళ్లం. ఆ దెయ్యాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి సినిమాలు తీశారు మ‌న ద‌ర్శ‌కులు. హార‌ర్ సినిమా అంటే… ఓ దెయ్యం, ఓ ఇల్లు, కాస్త కామెడీ, ఇంకాస్త హార‌ర్.. ఇదే తంతు. అయితే వాటిలోనే హిట్లు ప‌డ్డాయి. ఈ లైన్ దాటి కొత్త‌గా ఆలోచించిన‌వాళ్లూ హిట్లొచ్చాయి. ఇప్పుడు సందీప్ కిష‌న్ అదే చేశాడు. `అద్దంలో దెయ్యాన్ని` చూపించి ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నాడు. సందీప్ కిష‌న్ కొత్త సినిమా `నిను వీడ‌ని నీడ‌ను నేను`. కార్తీక్ రాజు ద‌ర్శ‌కుడు. వెన్నెల కిషోర్ కీల‌క పాత్ర పోషించాడు. ట్రైల‌ర్ విడుద‌లైంది. ట్రైల‌ర్ చూస్తుంటే… ఈమ‌ధ్య వ‌చ్చిన హార‌ర్ కామెడీల‌తో పోలిస్తే భిన్నంగానే ఉంది. భ‌యం, కామెడీ రెండూ వ‌ర్క‌వుట్ అయిన‌ట్టు క‌నిపిస్తున్నాయి. పోసాని, ముర‌ళీ శర్మ‌, వెన్నెల కిషోర్‌.. వీళ్లంతా న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు. పాయింట్‌గా చూస్తే… తెర‌పై న‌వ్వులు పంచే స‌త్తా, భ‌య‌పెట్టే స్టామినా ఈ క‌థ‌లో క‌నిపిస్తున్నాయి. మ‌రి ద‌ర్శ‌కుడు ఎలా హ్యాండిల్ చేశాడో చూడాలి. త‌మ‌న్ నేప‌థ్య సంగీతం ఈ చిత్రానికి ప్ల‌స్ పాయింట్‌గా క‌నిపిస్తోంది. విజువ‌ల్స్ కూడా బాగానే ఉన్నాయి. మొత్తానికి చాలా కాలం త‌ర‌వాత‌ సందీప్‌కిష‌న్ సినిమాకి హిట్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఏం జ‌రుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close