తెలుగు సినిమా ఇండస్ట్రీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. TFCC అధ్యక్ష పదవికి నిర్మాత సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన 24గంటల్లోనే ఆయన పదవికి రాజీనామా చేశారు.
తెలంగాణ ఫిలిం చాంబర్ అధ్యక్షుడిగా శనివారమే మూడోసారి ఎన్నికయ్యారు సునీల్ నారంగ్. ఇంతలోనే ఆయన రాజీనామా చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొందరి వ్యాఖ్యలు తనను బాధించాయని, తనకు సమాచారం ఇవ్వకుండా ఇష్టారీతిన ప్రకటనలు ఇస్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
అంతేకాకుండా తనకు సంబంధం లేని విషయాల్లో తనను లాగుతున్నారని రీజైన్ లెటర్ లో పేర్కొన్నారు సునీల్ నారంగ్. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్ గా కొనసాగలేనని, చాంబర్ సజావుగా కొనసాగేందుకు సమర్ధుడైన వ్యక్తిని ప్రెసిడెంట్ గా ఎన్నుకోవాలని సూచించారు.