‘అరవింద సమేత..’లో ‘అతడు’ కనెక్షన్‌!

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘అరవింద సమేత… వీరరాఘవ’ చిత్రానికి, మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘అతడు’ చిత్రానికి రెండు కనెక్షన్స్‌ వున్నాయి. అవేంటో తెలుసా? రెండు చిత్రాలకు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకుడనే విషయాన్ని అందరూ సులభంగా చెప్పేస్తారు. ఇంకొకటి… ‘అతడు’లో కమెడియన్‌గా నటించిన సునీల్‌ ఈ ‘అరవింద సమేత…’లోనూ కమెడియన్‌గా నటిస్తున్నాడు. అంతే కాదు… ఎన్టీఆర్‌ సినిమాలో అతడి పాత్ర అచ్చంగా ‘అతడు’లో వున్నట్టు వుంటుందని చెప్పాడు. సునీల్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘సిల్లీ ఫెలోస్‌’ ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు. అప్పుడు ‘అరవింద సమేత వీరరాఘవ’లో మీ పాత్ర ఎలా వుంటుంది? అని అడిగితే… ‘‘నా స్నేహితుల్లో ఇద్దరు ముగ్గురు నన్ను ఇదే ప్రశ్న అడిగారు. సింపుల్‌గా చెప్పాలంటే ‘అతడు’లో నా పాత్ర ఎలా వుంటుందో? ఆ తరహాలో వుంటుంది. ఆ తరహా వినోదం పంచుతుంది’’ అని సునీల్‌ చెప్పాడు. ‘సిల్లీ ఫెల్లోస్‌’లో క్యారెక్టర్‌ ‘సొంతం’, ‘ఆడుతూ పాడుతూ’ సినిమాల్లో అతడి క్యారెక్టర్‌ తరహాలో లౌడ్‌గా వుంటుందట! ప్రేక్షకులు లాజిక్కుల గురించి ఆలోచించకుండా సినిమా చూస్తే… కామెడీ మేజిక్‌ని ఎంజాయ్‌ చేయవచ్చని చెబుతున్నాడు!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండ‌లు పెంచుతున్న‌ నాగ‌శౌర్య

ల‌వర్ బోయ్ పాత్ర‌ల‌కు అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతాడు నాగశౌర్య‌. త‌న కెరీర్‌లో అలాంటి క‌థ‌లే ఎక్కువ విజ‌యాల్ని అందించాయి. అయితే... మాస్ హీరోగా నిరూపించుకోవాల‌న్న‌ది నాగ‌శౌర్య తాప‌త్ర‌యం. అలాంటి క‌థ‌లు ఎంచుకుంటున్నా - స‌రైన...

‘పుష్ష‌’‌పై విజ‌య్‌ సేతుప‌తి క్లారిటీ

అల్లు అర్జున్ - సుకుమార్‌ల హ్యాట్రిక్ సినిమా 'పుష్ష‌'. ఈ సినిమా కోసం విజ‌య్ సేతుప‌తిని విల‌న్ గా ఎంచుకున్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల విజ‌య్ ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నాడు. ఆ...

వ‌ర్మ‌ని లైట్ తీసుకున్నాడా?

రాంగోపాల్ వ‌ర్మ పేల్చ‌బోతున్న బాంబు `ప‌వ‌ర్ స్టార్‌`. ఓటీటీ వేదిక‌గా వ‌ర్మ ఇది వ‌ర‌కు ప‌లు సినిమాల్ని వ‌దిలాడు. దేనికీ రాని క్రేజు.. `ప‌వ‌ర్ స్టార్‌`కి వ‌చ్చింది. ఈ సినిమా స్పెషాలిటీ గురించి...

రాజకీయాల్లో రాజస్థాన్ “సచిన్” హిట్ వికెట్ ..!?

రాజస్థాన్ ప్రభుత్వాన్ని మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కూల్చేసినట్లుగా కూల్చేస్తారని భావించిన సచిన్ పైలట్.. చివరికి.. హిట్ వికెట్‌గా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తన వైపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఆయన తనకు...

HOT NEWS

[X] Close
[X] Close