ఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ఇరుక్కున్న ఇద్దరు ఐపీఎస్లకు నిద్ర పట్టడం లేదు. ఓ ఐపీఎస్ ఏపీలోనే ఉండి.. రఘురామ కృష్ణరాజుపై సోషల్ మీడియా ప్రకటనలు చేస్తూంటే.. మరో ఐపీఎస్ బీహార్లో ఉండి ఎలా అరెస్టు కాకూడదో లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఒకే గేమ్ ఆడుతున్నారు. రఘురామ .. ఈ కేసులో కొంత మంది పేర్లు చెప్పాలని బెదిరించారని.. ఆయన కాల్ హిస్టరీ తీస్తే అన్నీ బయటకు వస్తాయని సునీల్ నాయక్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
దీన్ని పట్టుకుని సునీల్ కుమార్ కూడా ఓ పోస్టు పెట్టారు. సునీల్ నాయక్ చెప్పారు కాబట్టి వెంటనే రఘురామను సీబీఐ అరెస్టు చేయాలని.. ఆయన ఎవరెవర్ని బెదిరించారో బయటకు లాగాలని డిమాండ్ చేశారు. సీబీఐ ఎందుకంటే ఆయనపై బ్యాంకు రుణాల కేసు ఉందట. సునీల్ నాయక్ ను నిజంగా బెదిరించి ఉంటే.. ఆయనఫోన్ కో..మరో ఫోన్ కో చేసి ఉంటారు. ఆ కాల్ లిస్టు బయటపెడితే చాలా వరకూ ఆయన చెప్పింది నిజమని అనుకుంటారు. కానీ అలా చెప్పకుండా..రఘురామ కాల్ లిస్ట్ చెక్ చేయాలని చెప్పడమే వింతగా ఉంది. ఫోన్ వచ్చింది ఆయనకు.. ఆయన ఫలానా తేదీన..ఫలానా సమయంలో రఘురామ ఫోన్ చేసి బెదిరించారని బయటపెడితేనే నమ్ముతారు.లేకపోతే అంతా ట్రాష్ అనుకుంటారు. సుదీర్ఘమైన పోలీసు సర్వీసులో ఉన్న వీరికి ఈ విషయం తెలియనిది కాదు.
రఘురామ తనను వీరు కొట్టకపోతే వీరిపై ఇంత వ్యతిరేకత చూపించాల్సిన అవసరం లేదు. రఘురామ ఎప్పుడూ వారితో కలిసి పని చేయలేదు. వారిపై కోపం పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఆయన తనను హింసించారు కాబట్టి ఇంతగట్టిగా పోరాడుతున్నారు. అయితే ఈ ఆఫీసర్లకూ ఆయనపై కోపం ఉండాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయ బాసుల కోసం చేశారు. ఇప్పుడు నిండా ఇరుక్కుని ..తమపై పోరాడుతున్న రఘురామనే టార్గెట్ చేసుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారు.
