సునీల్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. క్రాంతిమాధవ్ దర్శకుడు. ఈ చిత్రానికి టైటిల్ ఫిక్సయ్యింది. అదే.. ఉంగరాల రాంబాబు. చిత్రీకరణ తుది దశకు చేరుకొంది. డిసెంబరు 23న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారని సమాచారం. వరుస ఫ్లాపులతో డీలా పడ్డ సునీల్ మళ్లీ గట్టెక్కాలంటే ఉంగరాల రాంబాబు సినిమాని హిట్ చేసుకోవాల్సిందే. మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు తరవాత క్రాంతి మాధవ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఇది. మళ్లీ మళ్లీ.. ఓ ఫీల్ గుడ్ మూవీలా నిలిచింది. క్రాంతి మాధవ్ ఎమోషన్స్ ని బాగా పండిస్తాడు. అయితే.. సునీల్ బాడీ లాంగ్వేజ్ వేరు. తనది కామెడీ పీసు.. ఫేసు. మరి సునీల్‌కి సరిపడా నవ్వుల్ని ఈ సినిమాలో ఎలా మేళవించారన్నది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు దసరాకి వచ్చిన ఈడు గోల్డెహె… డిజాస్టర్ల జాబితాలో చేరిపోయింది. ఈ సినిమాకి ఓవరాల్ గా రెండు కోట్లు కూడా ముట్టలేదని టాక్. దాదాపు 11 కోట్ల బడ్జెట్ అయ్యిందని, రెండు కోట్లు కూడా వెనక్కి రాకపోవడంతో నిర్మాతల పరిస్థితి ఘోరంగా తయారైందని చెప్పుకొంటున్నారు. ఈ ఎఫెక్ట్ మూలంగానే టూ కంట్రీస్ రీమేక్ సినిమా సునీల్ చేతి నుంచి జారిపోయిందని టాక్. ఎన్.శంకర్ – సునీల్ కాంబోలో టూ కంట్రీస్ రీమేక్ తెరకెక్కాల్సివుంది. అయితే.. ఇప్పుడు ఆ నిర్మాతలు పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. ఇదే స్క్రిప్టుతో మరో హీరోని అప్రోచ్ అయ్యే ఆలోచనలో ఉన్నారట. సునీల్ బ్యాట్ టైమ్ అంత ఘోరంగా నడుస్తోందిప్పుడు.