ఎన్టీఆర్ సినిమాలో సునీల్ స‌ర్‌ప్రైజ్‌

సునీల్ హాస్య న‌టుడిగా గుర్తింపు పొంది, ఇప్పుడీ స్థాయిలో ఉన్నాడంటే కార‌ణం త్రివిక్ర‌మ్‌. నువ్వు నాకు న‌చ్చావ్‌, నువ్వే కావాలి, నువ్వే నువ్వే లాంటి సినిమాల్లో త్రివిక్ర‌మ్ సునీల్ కోసం అద్భుత‌మైన పాత్ర‌లు సృష్టించాడు. అవి సునీల్ కెరీర్‌కి చాలా బాగా హెల్ప్ అయ్యాయి. ఓ గొప్ప ఫ్లాట్ ఫామ్‌గా నిలిచాయి. స్నేహ ధ‌ర్మం కావొచ్చు, స్నేహితుడ‌నే స్వార్థం కావొచ్చు.. త్రివిక్ర‌మ్ ఎప్పుడూ సునీల్‌కి మంచి పాత్రలే రాశాడు. ఆ త‌ర‌వాత సునీల్ హీరో అయ్యాడు. త్రివిక్ర‌మ్ సినిమాలు కొన్ని మిస్ అయ్యాడు.

హీరో నుంచి మ‌ళ్లీ క‌మెడియ‌న్‌గా మారిన సునీల్ కోసం త్రివిక్ర‌మ్ మ‌ళ్లీ పాత్ర‌లు సృష్టించ‌డం మొద‌లెట్టాడు. అర‌వింద స‌మేత‌, అల వైకుంఠ‌పుర‌ములో చిత్రాల్లో సునీల్ కనిపించాడు. అయితే… ఇది వ‌ర‌క‌టి త్రివిక్ర‌మ్ – సునీల్ మ్యాజిక్ ఈ రెండు సినిమాల్లోనూ క‌నిపించ‌లేదు. అల వైకుంఠ‌పుర‌ములో అయితే మ‌రీ దారుణం. సునీల్ ఉన్నాడా, లేడా?  అనే అనుమాన‌మూ వ‌చ్చేస్తుంటుంది. ఈ రెండు సినిమాల వ‌ల్ల సునీల్ కి కొత్త‌గా ఒన‌గూరిన ప్ర‌యోజ‌నం ఏమీ లేదు. సునీల్ ఇప్పుడు డౌన్‌లో ఉన్నాడు. త్రివిక్ర‌మ్ చిత్రాలు త‌న‌కు హెల్ప్ అవుతాయ‌ని భావిస్తే… నిరాశే ఎదురైంది. ఇప్పుడు ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు త్రివిక్ర‌మ్ ఈసారి.. సునీల్ కోసం ఓ వెరైటీ పాత్ర రాయ‌బోతున్నాడ‌ట త్రివిక్ర‌మ్‌. `నువ్వు నాకున‌చ్చావ్‌` లో బంతి పాత్ర ఎంత ఫ‌న్ సృష్టించిందో… ఈసారీ అంతే వినోదం పంచివ్వ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. సునీల్ పాత్ర సినిమా అంతా క‌నిపిస్తూనే ఉంటుంద‌ని, ఎన్టీఆర్ ప‌క్క‌నే ఉంటూ.. మిగిలిన పాత్ర‌ల‌న్నింటినీ డామినేట్ చేస్తుంటాడ‌ని సమాచారం. ఈ సినిమాతో పాత సునీల్ క‌నిపిస్తాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. అదే నిజ‌మైతే… సునీల్ కి మ‌రో నాలుగైదేళ్లు ఢోకా లేన‌ట్టే. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : టీవీ9 నుంచి ఇంకెంత మంది బయటకు..!?

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టీవీ9పై ఇప్పుడు రాజకీయ రంగు పడింది. అధికారానికి మడుగులొత్తే చానల్‌గా మారిపోయింది. అదే సమయంలో పాత చార్మ్‌ను కొద్ది కొద్దిగా కోల్పోతూ.. వెలిసిపోతూ...

“సీఎంఆర్ఎఫ్ విరాళాల”పై రేవంత్ గురి..!

తెలంగాణ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టడానికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొత్త తరహాలో ఆలోచిస్తూ ఉంటారు. కేటీఆర్ .. ఫామ్‌హౌస్ విషయాన్ని ప్రజల్లోకి చర్చకు పెట్టి టీఆర్ఎస్ ను కాస్త...

కేసీఆర్‌కు రామ్‌మాధవ్ బెదిరింపులేంటో..!?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అధికార, రాజకీయ కార్యకలాపాలకు త్వరలోనే ముగింపు తప్పదంటూ... బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి. కరోనా విషయంలో... కాళేశ్వరం నిర్మాణ...

జగన్ పట్టుబట్టినా కర్ణాటకకే “మందాకిని”..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం .. కేంద్రానికి ఎంతగా సహకరిస్తున్నా... ఢిల్లీ సర్కార్ మాత్రం.. ఏపీ ప్రయోజనాలను కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఏపీకి కేంద్రం కేటాయిస్తుందని ఆశలు పెట్టుకున్న మందాకిని బొగ్గు గనిని కర్ణాటకకు...

HOT NEWS

[X] Close
[X] Close