సన్నీ లియోన్‌ని ప్రేక్షకులు ఇలా చూడగలరా??

సన్నీ లియోన్ అంటే శృంగారం. శృంగారం అంటే సన్నీ లియోన్. అంతే… ఆమెకి ఉన్న ఇమేజ్ అటువంటిది మరి. నీలి చిత్రాల నుంచి భారతీయ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన ఈమె ఇక్కడ కూడా ఎక్కువగా శృంగార భరిత చిత్రాలే చేశారు. ఆమె ఇమేజ్ క్యాష్ చేసుకొనే ప్రయత్నమే ఎక్కువమంది దర్శక నిర్మాతలు చేశారు. అటువంటి సన్నీ లియోన్ కత్తి పట్టుకొని యుద్ధం చేస్తుంటే ప్రేక్షకులు చూస్తారా? చూడగలరా? అనేది పెద్ద డౌట్. సన్నీ ముఖ్యతారగా మలయాళ దర్శకుడు విసి వడివుడయాన్ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ‘వీరమహాదేవి’ సినిమా తీస్తున్నారు. అందులో ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల చేశారు. ‘బాహుబలి’లో ప్రభాస్, ‘మగధీర’లో రామ్ చరణ్ టైపులో ఉందీ లుక్. రాణీ రుద్రమదేవి తరహా పాత్రలో సన్నీ లియోన్ ఎంత వరకూ నటించి మెప్పిస్తారు? ప్రేక్షకులు ఆమెను ఆ పాత్రలో ఎలా రిసీవ్ చేసుకుంటారు? అనే అంశాలపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. అనుష్క ఇలాంటి పాత్రల్లో నటిస్తే ఎలాంటి సందేహాలు అవసరం లేదు. ఆమెకు అటువంటి ఇమేజ్ ఉంది. సన్నీ లియోన్ ఇమేజ్ అందుకు కంప్లీట్ డిఫరెంట్ కదా!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close