అపోలో ఆస్పత్రిలో రజనీకాంత్..!

సూపర్ స్టార్ రజనీకాంత్ హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చేరారు. గత పది రోజులుగా ఆయన హైదరాబాద్‌లో అన్నాత్తే సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే.. ఆ సినిమా యూనిట్‌లో ఆరుగురికి కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్ ఆగిపోయింది. హైదరాబాద్‌లోనే.. రజనీకాంత్ ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే ఈ ఉదయం హఠాత్తుగా బీపీ పెరగడంతో.. ముందు జాగ్రత్తగా అపోలో ఆస్పత్రికి తరలించారు.

రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉందని.. ఎవరూ ఎలాంటి పుకార్లు వ్యాపింపచేయవద్దని.. అపోలో ఆస్పత్రి యాజమాన్యం కోరింది. రజనీకాంత్‌కు కరోనా సోకలేదని స్పష్టం చేసింది. రజనీకాంత్ ఆరోగ్య పరంగా సున్నితమైన వ్యక్తి. గతంలో ఆయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. ఇటీవలి కాలంలో ఆయన ఆరోగ్యంపై రకరకాల రూమర్స్ వచ్చాయి. అయితే అవన్నీ రూమర్సేనని.. తాను రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నానని ఆయన ప్రకటించారు.

అన్నాత్తే సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి.. రాజకీయ పార్టీ ప్రారంభించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే అన్నాత్తే షూటింగ్ ఆగిపోవడం.. ఆస్పత్రిలో చేరాల్సి రావడంతో… అభిమానుల్లో టెన్షన్ ప్రారంభమయింది. ఈ ఏడాది చివరిలో అంటే.. మరో వారంలో ఆయన పార్టీని ప్రకటించాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close