తెలంగాణా ప్రభుత్వానికి సుప్రీం కోర్టు, హైకోర్టు నోటీసులు

సాధారణంగా ఏ రాష్ట్ర ప్రభుత్వమయినా కోర్టులలో రెండు మూడుసార్లు మొట్టి కాయలు పడగానే మళ్ళీ అటువంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తపడుతుంటాయి. కానీ తెలంగాణా ప్రభుత్వానికి నెలకొకసారయినా ఏదో ఒక కోర్టు చేత మొట్టికాయలు వేయించుకోవడం ఒక ఆనవాయితీగా మారిపోయినట్లు కనిపిస్తోంది. బీసీల జాబితా నుండి శెట్టి బలిజలను తొలగించినందుకు వారు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే, వారి పిటిషన్ని విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు ఏ ప్రాతిపదికన వారిని బీసీల జాబితా నుండి తొలగించారని ప్రశ్నిస్తూ నోటీసు జారీ చేసింది. ఈనెల 24వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

పార్లమెంటరీ కార్యదర్శులకు కేబినేట్ హోదా కల్పించడంపై కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు మూడు నెలల క్రితం తను ఇచ్చిన నోటీసుకు తెలంగాణా ప్రభుత్వం ఇంత వరకు స్పందించకపోవడంతో ఇవ్వాళ్ళ మళ్ళీ నోటీసు జారీ చేసింది. ఈసారి నిర్లక్ష్యం చేసినట్లయితే తెలంగాణా ప్రభుత్వానికి జరిమానా విధిస్తామని హెచ్చరించింది కూడా. బహుశః దేశంలో మరే ఇతర రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణా ప్రభుత్వంలాగ కోర్టుల చేత ఇన్నిసార్లు మొట్టి కాయలు వేయించుకొని ఉండవేమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ తిట్లు తప్పేం కాదంటున్న వైసీపీ ఎమ్మెల్యే..!

వైసీపీ ఎమ్మెల్యేలు తమ భాషను అధికారిక భాషగా ప్రకటించుకుంటున్నారు. మీడియా ముందు అత్యంత దారుణంగా మాట్లాడుతూ.. మేమింతే మాట్లాడతామని ఎదురు దబాయించడం ఇప్పటి వరకూ చూశాం. ఇప్పుడు తమ తిట్ల వల్ల ఓ...

సుప్రీం చెప్పినా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదన్న వెంకట్రామిరెడ్డి..!

ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి .. ఎస్ఈసీ నిమ్మగడ్డను చంపే హక్కు కూడా ఉందన్నట్లుగా మాట్లాడి సంచలనం సృష్టించారు. ఇప్పుడు తన మాటలు వక్రీకరించారని చెప్పుకోవడానికి మీడియా ముందుకు వచ్చి మరింత వివాదాస్పదమైన...

వ్యాక్సినేషన్ ఉన్నా గుజరాత్‌లో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్..!

పంచాయతీ ఎన్నికల అంశం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఉత్కంఠకు కారణం అవుతోంది. వ్యాక్సినేషన్ వల్ల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో బలంగా వాదించాలని నిర్ణయించుకుంది. ఎన్నికలు జరపాలని అనుకుంటే వ్యాక్సినేషన్...

అప్పట్నుంచి గడ్డం తీసుకోని ఎల్వీ సుబ్రహ్మణ్యం..!

మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణం హఠాత్తుగా గుంటూరులో కనిపించారు. రామ మందిరానికి విరాళాలు సేకరించే ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. గబుక్కున ఆయనను చూసిన వారు చాలా మంది పోల్చుకోలేకపోయారు. ఎవరో స్వామిజీ ప్యాంట్,...

HOT NEWS

[X] Close
[X] Close