బీఆర్ఎస్ హయాంలో సంచలనం సృష్టించిన లాయర్ గట్టు వామనరావు, ఆయన భార్య నాగమణి హత్య కేసును సీబీఐకి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 021 ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా మంథనిలో ఈ హత్యలు జరిగాయి. పట్టపగలు, నడి రోడ్డు మీద జరిగిన హత్య జరిగింది. కిరాయి హంతకులు ఇష్టం వచ్చినట్లుగా నరికి చంపేశారు. వామనరావు చనిపోయే ముందు మాట్లాడిన మరణ వాంగ్మూలం వీడియో వైరల్గా మారింది.
ఈ వీడియో ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ కి పంపించారు. ఇది అసలైన వీడియోగా FSL నిర్ధారించింది. వామనరావు మరణ వాంగ్మూలంలో పుట్ట మధు పేరును ప్రస్తావించారు. ఆయన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. గత ఎన్నిక్లలో మంత్రి శ్రీధర్ బాబు చేతిలో ఓడిపోయారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వామనరావు హత్యకు సంబంధించిన సాక్ష్యాలు స్పష్టంగా ఉన్నా దర్యాప్తు నిష్పాక్షికంగా జరగలేదన్న ఆరోపణలు వచ్చాయి. కేసును సీబీఐకి ఇచ్చినా అభ్యంతరం లేదని ప్రస్తుత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
సుప్రీంకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించడంతో, వాంగ్మూలం వీడియోలోని వివరాలు, ఆ వీడియోలో పేర్లు చెప్పిన వారు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. పుట్ట మధుకర్ పై అనేక కేసులు, వివాదాలు ఉన్నాయి. ఆయన లాయర్ దంపతుల హత్య జరిగిన తర్వాత చాలా కాలం అజ్ఞాతంలో ఉన్నారు. ఇతర పార్టీల్లోనూ చేరుతారన్న ప్రచారం జరిగింది. చివరికి బీఆర్ఎస్లోనే ఉన్నారు.