వైసీపీ హయాంలో రఘురామను టార్గెట్ చేస్తూ హైదరాబాద్ లో ఆయన ఇంటి చుట్టూ పెట్టిన నిఘా సిబ్బందిలో ఒకరు తనపై దాడి చేశారని పెట్టిన ఎఫ్ఐఆర్ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. రఘురామ గచ్చిబౌలి బౌల్డర్ హిల్స్‌లో నివాసం ఉంటారు. ఆయన ఇంటి వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూడంటంతో అనుచరులు పట్టుకున్నారు. తాను ఏపీ పోలీసు డిపార్టుమెంట్లో పని చేస్తానని చెప్పుకున్నాడు. కానీ అతని వద్ద ఐడీకార్డు కూడా లేకపోవంతో పోలీసులకు అప్పగించారు.
అయితే ఆ వ్యక్తి ఫరూక్ బాషా ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ అని తేలింది. విధి నిర్వహణలో ఉన్న తనపై నలుగురు వ్యక్తులు దాడి చేశారంటూ.. రఘురామ కృష్ణరాజుతోపాటు మరో నలుగురిపై ఫరూక్ బాషా గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గచ్చిబౌలి పోలీసులు రఘురామతో పాటు ఆయన కుమారుడిపై కేసు పెట్టారు. ఈ కేసు తప్పుడు కేసు అని క్వాష్ చేయాలని రఘరామ హైకోర్టును ఆశ్రయించారు. కానీ అనుకూల ఫలితం రాలేదు. దాంతో ఆయన సుప్రీంకోర్టుోల పిటిషన్ వేశారు.
తన ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగాడుతున్న వ్యక్తిని సందేహంతో ప్రశ్నిస్తే ఇదంతా జరిగిందని చెప్పారు. కానిస్టేబుల్ కూడా.. కేసును కొనసాగించేందుకు ఆసక్తిగా లేనని తెలిపారు. దాంతో సుప్రీంకోర్టు ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేసింది. అప్పట్లో ఏపీ పోలీసులు హైదరాబాద్ లో విచ్చలవిడిగా టీడీపీ నేతల్ని.. రఘురామ వంటి వారిని టార్గెట్ చేసేవారు. వైసీపీకి బీఆర్ఎస్ పెద్దలు ఆ చాన్స్ ఇవ్వడంతో .. జగన్ సర్కార్ వేధింపుల విషయంలో మరో రేంజ్ కు వెళ్లింది. ఆ కేసులన్నీ ఇప్పుడు తేలిపోతున్నాయి.