రఘురామ కేసులో “సుప్రీం” టర్న్..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో సీఐడీ పోలీసులు కొట్టారో లేదో తేల్చడానికి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామకు వైద్యపరీక్షలు నిర్వహించాలని.. జ్యుడిషియల్ అధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆదేశాలు అమలయ్యేలా ఏపీ సీఎస్‌ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. తన తండ్రిపై సీఐడీ అధికారులు హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ.. రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపి ఈ ఆదే్శాలు జారీ చేసింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో… వైద్యపరీక్షలను వీడియోగ్రఫీ చేయాలని.. నివేదికను సీల్డ్‌కవర్‌లో ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వైద్యపరీక్షల సమయాన్ని జ్యుడిషియల్ కస్టడీగా పరిగణించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎంపీకి వై కేటగిరీ భద్రత కొనసాగించాలని రూలింగ్ ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ రఘురామకృష్ణరాజును ఆర్మీ ఆస్పత్రిలోనే ఉంచాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

రఘురామకృష్ణరాజు మరో వైపు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపైనా సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సర్కార్‌ను ఆదేశిస్తూ.. శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో.. రఘురామకృష్ణరాజు తరపున.. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులను వాదించిన లాయర్ ముకుల్ రోహత్గీ వాదించారు. రఘురామను అరెస్ట్‌ చేసిన తీరును న్యాయస్థానానికి వివరించిన రోహత్గీ.. బెయిల్‌ రాకూడదనే సెక్షన్‌ 124(ఏ) కింద కేసు నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రఘురామపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని.. సీఐడీ అదనపు డీజీ స్వయంగా విచారణకు ఆదేశించారని.. దాని ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని గుర్తు చేశారు. ముందస్తు ప్లాన్ ప్రకారం.. గుంటూరు తీసుకెళ్లాలనే ప్లాన్ చేశారన్నారు. ప్రభుత్వం తరఫున దుష్యంత్‌ దవే అనే సీనియర్ లాయర్ వాదనలు వినిపించారు. రమేష్ ఆస్పత్రిలో పరీక్షలు వద్దని.. మంగళగిరి ఎయిమ్స్‌లో అభ్యంతరం లేదని ఆయన వాదించారు.

సుప్రీంకోర్టులో విచారణలు జరుగుతున్న సమయంలోనూ.. హైకోర్టు ఆదేశాలను పాటించడానికి సీఐడీ ముందుకు రాలేదు. వైద్య పరీక్షల కోసం రమేష్ ఆస్పత్రికి తరలించాలని నిన్న రాత్రి ఎనిమిది గంటల సమయంలో హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ అమలు చేయలేదు. రమేష్ ఆస్పత్రికి తరలించడానికి తమకు అభ్యంతరాలున్నాయని చెప్పినా… వేరే పిటిషన్ వేసుకోవాలని సూచించిన హైకోర్టు.. ఆదేశాలు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. అయినప్పటికీ సీఐడీ అధికారులు హైకోర్టు ఆదేశాలను పాటించడానికి సిద్ధపడలేదు. దీంతో.. సుప్రీంకోర్టు తమ ఆదేశాలను పాటించాల్సిన బాధ్యతను ఏపీ సీఎస్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో యూఎస్‌లో బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ షోను ఏర్పాటు చేసిన హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌

త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో యూఎస్‌లో  'అలా అమెరికాపురములో..` పేరుతో బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ షోను ఏర్పాటు చేసిన  హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌. సెన్సేష‌న‌ల్ కాన్స‌ర్ట్స్ ఏర్పాటుచేయ‌డంలో అగ్రగామిగా ఉన్న హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ఈ సంవత్సరం టాలీవుడ్ మ్యూజిక్...

శ్రీ‌నువైట్ల మ‌ల్టీస్టార‌ర్… ‘డ‌బుల్స్‌’

వ‌రుస హిట్లు ఇచ్చిన శ్రీ‌నువైట్ల‌.. ఇప్పుడు వ‌రుస ఫ్లాపుల‌ను మోస్తున్నాడు. అయినా స‌రే, మళ్లీ త‌న‌దైన ముద్ర వేయ‌డానికి త‌ప‌న ప‌డుతున్నాడు. అందులో భాగంగా `ఢీ అండ్ ఢీ` తీస్తున్నాడు. `డ‌బుల్ డోస్‌`...

జనసేనను మరోసారి కించ పర్చిన ఏపీ బీజేపీ..!

పవన్ కల్యాణ్‌కు కేంద్రంలో మంత్రి పదవి అని ఢిల్లీ నుంచి బీజేపీ లీకులు ఇస్తూ గిలిగింతలు పెడుతోంది కానీ.. అసలు విషయం మాత్రం అసలు జనసేనను లెక్కలోకి తీసుకోవడం లేదు. ముఖ్యంగా ఏపీ...

ఏపీ సర్కార్‌ను అప్పులు చేయనివ్వొద్దని మోడీకి రఘురామ లేఖ..!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అప్పుల మీద నడుస్తోంది. నెలకు రూ. ఆరేడు వేల కోట్లు అప్పులు ఎలాగోలా తెచ్చుకోకపోతే.. ఆ నెల దివాలా ప్రకటించాల్సిన పరిస్థితి. ఆ అప్పులు కూడా రాకుండా చేయాలని...

HOT NEWS

[X] Close
[X] Close